భారత్ జాగృతి సంస్థ( India Vigilance Organization ) అక్టోబర్ 21న యూకేలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తోంది.బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే అత్యంత ముఖ్యమైన, పెద్ద పండుగ.
ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు జరుపుకుంటారు.అయితే ఈసారి భారత్ జాగృతి యూకే యూనిట్ పండుగ వేడుకలకు హాజరైన మహిళలకు ఉచితంగా చేనేత చీరలను అందజేయనుంది.
అక్టోబర్ 21న యూకేలో జరిగే ఈ బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kalvakuntla kavitha ) తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

భారత్ జాగృతి ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా వివిధ దేశాల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్( Bathukamma Celebrations ) అంబరాన్ని అంటుతున్నాయి.భారత్ జాగృతి యూకే యూనిట్ ఏటా మెగా బతుకమ్మ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది.ఈ ఏడాది యూకేలో జరిగే బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ఎన్నారైలు, అలానే ఇతర ఎన్నారైలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
మరికొద్ది రోజుల్లో ఈ వేడుకలు జరగనున్న నేపథ్యంలో కవిత మాట్లాడుతూ.బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని అన్నారు.మన తెలంగాణ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి ప్రధాన కారణం భారత్ జాగృతి కార్యకర్తలు కృషేనని అన్నారు.ఈ కార్యకర్తలు బతుకమ్మ పండుగను అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందడానికి కారణమయ్యారని తెలిపారు.
బతుకమ్మ పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలు వివిధ దేశాల్లో ప్రాచుర్యం పొందుతున్నాయన్నారు.బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలకు ఉచితంగా చేనేత చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన భారత్ జాగృతి యూకే యూనిట్‌ను కవిత అభినందించారు.







