ఆంధ్ర బిజెపిలో పవన్ పై అంతర్మదనం

నిజానికి చాలా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ( Bharatiya Janata Party ) వ్యవహారశాలి మిగిలిన పార్టీలకు అంత తేలిగ్గా కోరుకున పడదు। ముఖ్యంగా చాలా రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసి తమకు అనుకూలంగా రాజకీయ వాతావరణాన్ని మార్చుకోవడంలో సిద్దహస్తులయిన కమలనాధుల వ్యూహాలు ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) వరకు మాత్రం వర్కౌట్ అవటం లేనట్లుగా తెలుస్తుంది.ముఖ్యంగా ఆంధ్రాలో తమ మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వ్యవహార శైలి కమలనాధులకు కోరుకున పడడటం లేదు .

 Bjp Is Angry With Pavan Speed , Bharatiya Janata Party, Bjp, Andhra Pradesh, Paw-TeluguStop.com

ఒకవైపు ఎన్డీఏ లో ఉన్నాను అంటూనే స్వతంత్రంగా పొత్తు నిర్ణయాలు ప్రకటించడం ,వారాహి యాత్రలను ప్లాన్ చేసుకోవడం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుందని సభా ముఖంగా ప్రకటించడం వంటివి కమలనాధులు ఆగ్రహానికి కారణమవుతున్నట్లుగా తెలుస్తుంది.అయినప్పటికీ పవన్ ని ఏమీ అనలేని పరిస్థితుల్లో భాజపా ఉంది.

అందుకే కీలకమైన సమావేశాన్ని పెట్టుకున్న కమలనాధులు పవన్ కళ్యాణ్ పై ఏదో ఒకటి తేల్చాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర నాయకత్వానికి వివరించి పవన్ పై ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించమని ఒత్తిడి తీసుకురావాలని తెలుస్తుంది భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Telugu Andhra Pradesh, Pawan Kalyan, Purandeshwari, Satyaprasad, Varahi Yatra-Te

దీనికి అనుగుణంగానే ఆ పార్టీ కీలక నేత సత్యప్రసాద్( Satyaprasad ) పొత్తులపై ఎవరితో ఉన్నారో పవన్ నిర్ణయం తీసుకోవాలని పొరుగు పార్టీల నిర్ణయాలను తాము ఎలా చెప్పగలమంటూ ప్రశ్నించడం పవన్ వైఖరి పై నిరసన గానే చూడాల్సి వస్తుంది.అంతేకాకుండా పవన్ ప్రతి వ్యాఖ్యకు స్పందించాల్సిన అవసరం లేదని పురందేశ్వరి ( Purandeshwari )చేసిన వ్యాఖ్యలు చూస్తే పవన్ పై కేంద్ర నాయకత్వం గుర్రుగానే ఉన్నట్లు అర్థమవుతుంది అయితే మిత్ర పక్షానికి మద్దతుగా కూడా భాజపా పెద్దగా ప్రకటనలు చేయకపోవడం వల్ల పవన్ ను నిందించడానికి కూడా ఈ విషయంలో భాజపాకు పెద్దగా అవకాశం లేదు.అయితే ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల హడావిడి ఉన్నందున తొందరలోనే ఆంధ్రకు సంబంధించిన వ్యవహారాలపై కేంద్ర నాయకత్వం ఒక క్లారిటీ ఇస్తుందని రాష్టా బాజాపా నాయకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube