సూపర్ కార్లలో వెళ్తుండగా ఘోర యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్ డెడ్.. వీడియో వైరల్!

ఇటలీ( Italy ) దేశంలో తాజాగా ఘోర యాక్సిడెంట్ చోటు చేసుకుంది.అక్టోబర్ 2న సార్డినియాలోని గ్రామీణ రహదారిపై కొన్ని సూపర్ కార్లు అతి వేగంగా వెళ్తూ హల్చల్ చేశాయి.

 Fatal Accident While Traveling In Supercars Two Died On The Spot Video Viral , I-TeluguStop.com

ఆ సమయంలోనే రెడ్ కలర్ ఫెరారీ, బ్లూ కలర్ లంబోర్ఘిని కార్లు క్యాంపర్ వ్యాన్‌ను ఒకే టైమ్‌లో ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించాయి.కానీ రోడ్డు సరిపోక అది కుదరలేదు.

ఆ అతివేగంలో బ్రేక్స్ వేయడం కూడా సాధ్యపడలేదు.దాంతో ఫెరారీ కారు తన పక్కనే వస్తున్న లంబోర్ఘిని కారుకు డ్యాష్ ఇచ్చింది.

అంతే, లంబోర్ఘిని కారు( Lamborghini car ) వెళ్లి క్యాంపర్ వ్యాన్‌ను ఢీ కొట్టింది.దాంతో క్యాంపర్ వ్యాన్ బోల్తా పడింది.దానిని ఢీకొట్టిన లంబోర్ఘిని కారు కుడి దిశలో ఎగిరి కింద పడిపోయింది.రెడ్ కలర్ ఫెరారీ కూడా హై స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక కింద పడి పల్టీలు కొట్టింది.

ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో బ్లూ కలర్ లంబోర్ఘిని ఎదురుగా వస్తున్న లేన్‌లోకి వెళ్లడం ద్వారా తెల్లటి క్యాంపర్ వ్యాన్‌ను అధిగమించేందుకు ప్రయత్నించింది.ఎరుపు రంగు ఫెరారీ లంబోర్ఘినితో పాటు స్పీడ్ పెంచింది.దీని వలన ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు.

ఫెరారీలో మంటలు చెలరేగడంతో లోపల ఉన్న స్విస్ జంట మెలిస్సా క్రౌట్లీ( Melissa Croutley ) (63), మార్కస్ క్రౌట్లీ( Marcus Croutley ) (67) మరణించారు.లంబోర్ఘినిలో ఉన్న వారు గాయపడలేదు.

వారు బాగానే ఉన్నామని సైగలతో వెల్లడించారు.క్యాంపర్ వ్యాన్‌లోని దంపతులు, 61 ఏళ్ల వ్యక్తి, 62 ఏళ్ల మహిళ కూడా పెద్దగా గాయపడలేదు.

వారిని, లంబోర్గినీలో ఉన్న వ్యక్తులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు మూడు వెహికల్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

సార్డినియా సూపర్‌కార్ టూర్‌లో భాగంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా తెలిపింది.ఈ టూర్‌లో ప్రజలు లగ్జరీ కార్లను చూపించడానికి టెయులాడా నుంచి ఓల్బియా వరకు డ్రైవ్ చేస్తారు.

స్విట్జర్లాండ్‌కు చెందిన దంపతులు ఫోర్టే విలేజ్‌ని వదిలి మోర్స్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube