సిద్దిపేటలో( Siddipeta ) నూతన రైల్వే స్టేషన్ లో రైలు ప్రారంభ కార్యక్రమంలో రైల్వే అధికారులపై మంత్రి హరీష్ రావు( Minister Harish Rao ) సీరియస్ అయ్యారు.600 కోట్ల నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తమ ఫోటో వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.మంత్రి హరీష్ రావు సీరియస్ కావడంతో అక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు షాక్ అయ్యారు.పైగా హరీష్ రావు కార్యక్రమానికి వచ్చేసరికి రైలు రాక ఆలస్యం కావడంతో.
బీజేపీ- బీఆర్ఎస్ కార్యకర్తలు బాహబహికి దిగటం జరిగింది.ఈ పరిణామంతో మరింత విసుగెత్తిపోయిన హరీష్ రావు రైల్వే అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో రైల్వే స్టేషన్ లో( Railway Station ) ఏర్పాటు చేసిన మానిటర్ ను కాలితో తన్నారు.అనంతరం ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మోదీ ఫోటోను చించేశారు.సిద్దిపేట రైల్వే లైన్ ఏర్పాటు, 2508 ఎకరాల భూసేకరణ, స్టేషన్ల నిర్మాణం కోసం 33% శాతం మొత్తం నిధులు రూ.640 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను, రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేసిన మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోలు వేయకపోవడం పట్ల బీఆర్‌ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు.ఇదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా గొడవకు దిగటంతో రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు.దీంతో సిద్దిపేట నూతన రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం రసబసాగా మారింది.







