టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ (Ram charan) ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్(Game Changer) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక సినిమాల పరంగా కాక వ్యక్తిగతంగా రాంచరణ్ మూగజీవాలు అంటే ఎంతో ఇష్టం అనే విషయం మనకు తెలిసిందే.

ఇక ఈయన వద్ద ఇప్పటికే ఎన్నో గుర్రాలు ఉన్న విషయం తెలిసిందే.మగధీర సినిమా( Magadheera ) కంటే ముందుగానే రాంచరణ్ ప్రత్యేకంగా హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు.ఇలా గుర్రాలు అంటే ఎంతో ఇష్టమైనటువంటి ఈయన తాజాగా మరో కొత్త గుర్రాన్ని( New Horse ) కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే తన కొత్త గుర్రంతో కలిసి రామ్ చరణ్ దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఇలా గుర్రంతో కలిసి దిగిన ఫోటోని రాంచరణ్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ బ్లేజ్ మై న్యూ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ ఫోటో చూసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గేమ్ చేంజర్ సినిమా కోసమేనా అన్నా అంటూ ఈ ఫోటో పై పెద్ద ఎత్తున నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.అయితే ఇదివరకే రామ్ చరణ్ వద్ద కాజల్ అనే ఒక గుర్రం ఉన్న సంగతి మనకు తెలిసిందే .ఈయనకు వీలు దొరికినప్పుడల్లా అలా హార్స్ రైడింగ్( Horse Riding ) వెళ్తూ ఉంటారు.ఇప్పుడు మరొక గుర్రాన్ని తీసుకురావడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక రాంచరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవులకు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.







