ఏపీలో టీడీపీ, వైసీపీ మద్య రాజకీయ రగడ తారస్థాయిలో కొనసాగుతోంది.ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఒక పార్టీపై మరో పార్టీ ఆధిపత్య వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో విజయంపై గట్టిగా ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబును అనూహ్యంగా జైల్లో పెట్టి జగన్ వ్యూహాత్మకంగా సక్సస్ అయ్యారు.ఆ తరువాత చంద్రబాబు స్థానంలో పార్టీని లీడ్ చేస్తున్న లోకేశ్ పై కూడా అక్రమ కేసులను తెరపైకి తెచ్చి టీడీపీ స్పీడ్ కు బ్రేకులు వేశారు.
అయితే ప్రస్తుతం టీడీపీ నేతలపై జగన్( YS Jagan Mohan Reddy ) వ్యవహరిస్తున్న తీరు కేవలం కక్షపూరితమే తప్పా అందులో ఎలాంటి వాస్తవాలు లేవనేది టీడీపీ నేతలు చేస్తున్న ప్రధాన విమర్ష, ఇకపోతే తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మంత్రి రోజాపై( Roja ) అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే టీడీపీ అధినేతలైన చంద్రబాబు, నారా లోకేశ్ వంటివారిని వైసీపీ మంత్రులు చేసే దూషణ పరమైన వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కావు.సాక్షాత్తు అసెంబ్లీలోనే చంద్రబాబు సతీమణిని దూషించిన సందర్భాలు ఉన్నాయి.
ఇక మీడియా ముందు మాజీ మాంత్రి కొడాలి నాని( Kodali Nani ) చేసే అసభ్యకర వ్యాఖ్యలు ఎన్నో కోకొల్లలు.మరి అలా అలాంటి వారిపై సర్కార్ చర్యలు తీసుకోదా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

సొంత పార్టీ నేతలు ఇతరులను టిడితే నో కేస్.కానీ ఇతరులు వైసీపీ వాళ్ళను టిడితే కేసులు.ఏడెక్కడి న్యాయం జగన్ అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.అసలు బూతులకే కేరాఫ్ అడ్రస్ గా మారిన వైసీపీ నేతలను కంట్రోల్ లో ఉంచలేని అధినేత జగన్.
ఇతరులపై మాత్రం కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు.నిజానికి ఈ తరహా అభిప్రాయాలూ ప్రజల్లో కూడా వ్యక్తమౌతున్నాయి.
తరచూ వైసీపీ నేతలు చేసే బూతు వ్యాఖ్యలు, వ్యవహారాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన సందర్భాలు ఉన్నాయి.అలాంటి వ్యాఖ్యాలు చేసే వారిపై చర్యలు తీసుకోకపోగా ఇంకా సమర్థించడం గమనార్హం.
కానీ ప్రత్యర్థి పార్టీ నేతలు కాస్త అనుచిత వ్యాఖ్యలు చేసిన అరెస్ట్ లు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి.ఇది రాజారెడ్డి రాజ్యాంగం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మరి టీడీపీ వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్నలకు వైసీపీ నేతలు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.