భారత జనతా పార్టీ( BJP ) దక్షిణాది రాష్ట్రాలలో బలపడాలని ఎప్పటి నుంచో కలలు కాంటోంది.కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన సౌత్ లో మాత్రం సత్తా చాటలేకపోతుంది.
మొన్నటి వరకు అధికారంలో ఉన్న కర్నాటక కూడా బీజేపీ చేతిలో నుంచి జారిపోయింది.దాంతో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న ఒక్క దక్షిణాది రాష్ట్రం కూడా లేదు.
దీనికి తోడు బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీలు కూడా మెల్లమెల్లగా ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నాయి.గత ఎన్నికల ముందు ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ( TDP ) ఆ తరువాత బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా తమిళనాట అన్నడీఎంకే పార్టీ కూడా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చింది.ప్రస్తుతం దక్షిణాది పార్టీలలో ఒక్క జనసేన( Janasena ) మాత్రమే బీజేపీతో పొత్తులో ఉంది.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే జనసేన కూడా బీజేపీతో తెగతెంపులు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే గనుక జరిగితే బీజేపీకి దక్షిణాదిలో ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది.దాంతో ఎలాగని దక్షిణాదిన పట్టు కోల్పోకుండా ఉండేందుకు కమలనాథులు గట్టిగానే ప్లాన్ చేస్తేస్తున్నారు.ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ.
ఇటీవల టీడీపీతో జట్టు కట్టింది.

టీడీపీ జనసేన పొత్తుకు( TDP Janasena Alliance ) మద్దతు తెలపకపోతే.ఎన్డీయే కూటమి నుంచి జనసేన బయటకు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.అందుకే నిన్న మొన్నటి వరకు టీడీపీతో దూరం పాటించిన బీజేపీ.
ఇప్పుడు టీడీపీకి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.మళ్ళీ ఎన్డీయే కూటమిలో టీడీపీకి చోటు కల్పించి ఏపీలో 2014 సీన్ రిపీట్ చేయాలని చూస్తోంది.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) అరెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు కుదిరితే.చంద్రబాబును బయటకు తీసుకోచ్చేందుకు కేంద్ర పెద్దల సహకారం ఎంతవరకు ఉంటుందనేది ఆసక్తికరం.మొత్తానికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టీడీపీకి దూరం పాటించడం కన్నా.పొత్తు పెట్టుకోవడమే మేలని కమలనాథులు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు టాక్.







