సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక( Shivatmika ) దొరసాని సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.మొదటి సినిమా కమర్షియల్ గా నిరాశ పరిచినా కూడా ఆమెకు నటి గా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు.
హీరోయిన్ గా శివాత్మిక చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.కనుక ఆమె కెరీర్ లో మంచి దూకుడుగా ఉంటుందని అంతా భావించారు.
కానీ ఆమె కెరీర్ ఆశించిన స్థాయి లో లేదు అని చెప్పాలి.ఎందుకంటే హీరోయిన్ గా ఆమెకు పెద్ద సినిమా ల్లో ఆఫర్లు రావడం లేదు.
చిన్నా చితకా సినిమా లు లేదా సిరీస్ ల్లో ఆఫర్లు వస్తున్నాయి.
ఇటీవల ఒక స్టార్ హీరో( Star Hero ) సినిమా లో శివాత్మిక కి ఛాన్స్ వచ్చిందట.కానీ ఆ ఆఫర్ ని శివాత్మిక తిరస్కరించింది అంటూ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.ఆఫర్లు రావడం లేదని బాధ పడుతున్న శివాత్మిక స్టార్ హీరో సినిమా ను కాదనుకోవడం ఏంటి అన్నట్లుగా కొందరు విమర్శిస్తున్నారు.
అసలు విషయం ఏంటి అంటే శివాత్మిక హీరోయిన్ గా రాణించాలని కోరుకుంటుంది.కానీ ఆ స్టార్ హీరో సినిమా లో శివాత్మిక కి మెయిన్ లీడ్ కాకుండా కీలక పాత్రలో నటించాలని అడిగారట.
దాదాపు 30 నిమిషాల స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుందని కూడా అన్నారట.హీరోయిన్ గా( Heroine ) అవకాశం వస్తే చేస్తాను తప్ప చిన్నా చితకా ఆఫర్ల కు ఓకే చెప్పను అంటూ చెప్పేసిందట.దాంతో ఆ పాత్రకు మరో నటిని సదరు దర్శకుడు ఓకే చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.పెద్ద హీరో సినిమా లో చిన్న పాత్ర అయినా బాగుంటుంది కదా.ఓకే చెప్తే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం శివాత్మికకి ఆ సినిమా కు నో చెప్పడం మంచి నిర్ణయం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.