అనిరుధ్( Anirudh ravichander )ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అనిరుధ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి,క్రేజ్ గురించి మనందరికి తెలిసిందే.
ఈయనకు ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది అంటే ఈయన ఏ సినిమాలో పాట పాడిన కూడా ఆ సినిమా సూపర్ హిట్ అన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి.ఇప్పటికే అన్ని ఇండస్ట్రీలలో అనిరుద్ పేరు మారుమోగుతుండగా రీసెంట్‌గా రిలీజైన జైలర్, జవాన్( Jawan ) సినిమాలతో మనోడి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
స్టార్ డైరెక్టర్లు నిర్మాతలు అనిరుద్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఆయన రెమ్యూనరేషన్( Remuneration ) విషయం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒక్కో సినిమా కోసం ఆయన దాదాపుగా రూ.10 కోట్ల వరకు అందుకుంటున్నాడు టాక్.కానీ అస్సలు డబ్బులు తీసుకోకుండా పాడతాడని మనలో చాలామందికి తెలుసు? అవును మీరు విన్నది నిజమే.ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన అనిరుద్ ఒక్కో సినిమా కోసం దాదాపు రూ.10 కోట్లు వరకు తీసుకుంటున్నాడని సమాచారం.తన సినిమాల్లో కాకుండా ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన పాటలు కూడా పాడుతుంటాడు.
ఇలా పాడుతున్నందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోడు.ఈ విషయాన్ని స్వయంగా అనిరుధ్ చెప్పుకొచ్చారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిరుద్ ఈ విషయం గురించి స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పాడటం నా ప్రొఫెషన్ కాదు,కానీ దాన్ని ఎంజాయ్ చేస్తాను.అందుకే వేరే సంగీత దర్శకులు ఎవరైనా వచ్చి అడిగితే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్లకోసం పాట పాడుతాను అని అనిరుధ్ తెలిపారు.
ఇలా చేయడం వల్ల వాళ్ల కంపోజింగ్ స్టైల్ తెలుస్తుందని, అది తన మ్యూజిక్ స్టైల్‌ని అప్డేట్ చేసుకునే విషయంలో ఉపయోగపడుతుందని అన్నారు.ఇది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
చాలామంది ఈ విషయం తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.నిజంగా అనిరుద్ చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







