థమన్( Thaman ) ఎప్పుడు హిట్ కొడతాడో, ఎప్పుడు ఫట్ అంటాడా తెలియడం కష్టంగా ఉంది.ఇప్పుడు తమిళ్ లో ఎలాగైతే అన్ని సినిమాలకు అనిరుద్ సంగీతం అందిస్తున్నట్టు వింటూ ఉంటామో తెలుగు లో కూడా థమన్ పేరు జోరుగా వినిపిస్తూ ఉండేది.
కానీ ఈ మధ్య ఏమైందో ఏమో థమన్ సంగీతంలో జోరు తగ్గింది.ఆయనకు గుడ్ టైం ఎప్పుడు వస్తుందో బ్యాడ్ టైం ఎప్పుడు వస్తుందో కూడా చెప్పడం కష్టంగా మారిపోయింది.
ఒక్కోసారి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి సినిమాలకు ఆయువు పోస్తాడు.మరోసారి డిజాస్టర్ ఫలితాలను చవి చూస్తాడు.
ఇప్పుడు అయితే థమన్ ఇదేం సంగీతం అనే విధంగానే సినిమాలకు పని చేస్తున్నాడు.మరి థమన్ కి మంచి రోజులు వచ్చేదెప్పుడు ? ఈయన చేస్తున్న ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం.
ఇండస్ట్రీ లో చాల మంది దర్శకులకు థమన్ ఫెవరెట్.అందుకే కొన్ని సార్లు మిస్ ఫైర్ అయినా కూడా మళ్లి థమన్ వైపే అందరు చూస్తారు.కానీ ఈ మధ్య కాలంలో థమన్ నుంచి మంచి మ్యూజిక్ అయితే రాలేదు.దాదాపు అఖండ( Akhanda ) వరకు అదిరిపోయే సంగీతం ఇచ్చిన థమన్ ఆ తర్వాత నుంచి దాదాపు ఒక్క హిట్ కూడా మ్యూజిక్ పరంగా కొట్టలేదు.
భారీ అంచనాలతో వచ్చిన పవన్ కళ్యాణ్ బ్రో, రామ్ పోతినేని స్కంద సినిమాలకు కూడా యావేరేజ్ సంగీతం.కాదు .కాదు బిలో యావరేజ్ సంగీతం అందించాడు థమన్.దాంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
కానీ బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి పై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు ప్రస్తుతం థమన్.
ఇప్పుడు మరోసారి క్రేజీ మ్యూజిక్ అందించి తానేంటో మళ్లి నిరూపించుకోవాల్సిన పరిస్తతి ఏర్పడింది.అందుకోసం తన దగ్గర పెద్ద హీరోల సినిమాల లైనప్ ఉంది.మహేష్ బాబు గుంటూరు కారం, బాలకృష్ణ భగవంత్ కేసరి, పవన్ కళ్యాణ్ OG ( Pawan Kalyan )వంటి పెద్ద సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూడు సినిమాలకు అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ కొట్టి తనలో ఇంకా సత్త తగ్గలేదు అని నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు.ఇప్పటికే ఈ మూడు చిత్రాల టీజర్స్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.
మరి ఈ మూడు సినిమాలు హిట్ అయ్యి థమన్ బ్యాక్ టూ ఫామ్ అవుతాడా లేదా చూడాలి.