విశాఖలో బండారు సత్యనారాయణ( Bandaru Satyanarayana ) గుంటూరు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.ఈ క్రమంలో నోటీసులు ఇవ్వటానికి గుంటూరు పోలీసులు ప్రయత్నాలు చేయగా ఇంటి తలుపులు తెరవలేదు.
దీంతో బండారు ఇంటి బయట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు మధ్య తోపులాట జరిగింది.మంత్రి రోజాపై( Minister Roja ) చేసిన వ్యాఖ్యలు సీఎంను దూషించారనే ఆరోపణలతో.41B కింద నోటీసులు ఇచ్చి తర్వాత అరెస్టు చేయడం జరిగింది.అయితే బండారు అరెస్టు పట్ల నారా లోకేష్ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

“వైకామ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలంతా కూసే రోత బూతు కూతలపై ఎన్ని వేల కేసులు నమోదు చేయాలి పోలీసులు? బూతు కూతలు వద్దని హితవు పలికిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని మాత్రం టెర్రరిస్టులా అరెస్టు చేశారు.వైకామ పార్టీకి ఓ చట్టం, విపక్షాలకి మరో చట్టమా? ఇదేం అరాచక పాలన?” అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది.అంత మాత్రమే కాదు బండారు సత్యనారాయణమూర్తికి ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని పోరాటం కొనసాగించాలని కూడా లోకేష్ ( Nara Lokesh ) మాట్లాడటం జరిగింది.ఇదే సమయంలో అక్రమ కేసులు పెట్టే పోలీసులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తప్పదని హెచ్చరించారు.







