నిజామాబాద్ జిల్లాలో( Nizamabad ) దారుణం చోటుచేసుకుంది.సూపర్ మార్కెట్ లో ఓ చిన్న పాప ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడంతో.
కరెంట్ షాక్ తో( Current Shock ) స్పృహ తప్పి పడిపోయింది.వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించగా అప్పటికే పాప మృతి చెందటం అందరిని కలచివేసింది.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో జరిగింది.సూపర్ మార్కెట్( Super Market ) నిర్వాహకుల నిర్లక్ష్యంతో చిన్న వయసులోనే పాప మరణించడం పట్ల కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ మార్కెట్ నిర్వాహకులు కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వలన ఈ దురదృష్టం జరిగిందని మండిపడుతున్నారు.

రక్షణ చర్యలు తీసుకోకుండా షాపింగ్ మాల్( Shopping Mall ) నిర్వహిస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.తండ్రితో పాటు సూపర్ మార్కెట్ కి వచ్చిన రిషిత( Rishita ) అనే పాప అప్పటివరకు ఆడుతూ పాడుతూ చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసింది.ఆ తర్వాత వెంటనే కరెంట్ షాక్ గురై విలవిలలాడుతూ డోర్ కి వేలాడుతూ ఉంది.
కొద్దిసేపటికి తండ్రి గమనించి వెంటనే పాపని ఆసుపత్రికి తరలించగా అప్పటికే రిషిత మరణించినట్లు వైద్యులు తెలియజేయడం జరిగింది.ఈ మొత్తం దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.







