బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడం నారా లోకేశ్ కు ఇష్టం లేదా.. అసలు కారణాలివేనా?

గత కొద్ది రోజులుగా ఏపీ పాలిటిక్స్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో నారా బ్రాహ్మణి( Nara bramhini ) పేరు కూడా ఒకటి.తను మావయ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు( Chandrababu Naidu arrest ) కావడంతో మీడియా ముందుకు వచ్చింది బ్రాహ్మణి.

 Nara Lokesh Not Like To Bramhini Political Entry, Nara Lokesh, Bramhini, Politi-TeluguStop.com

తన మామయ్య అరెస్టు ని ఖండిస్తూ ఇప్పటికే మీడియాతో ముచ్చటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే నారా బ్రాహ్మణి రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలు జరగా వినిపించాయి.

ఇక ఆ వార్తలు విన్న నందమూరి అభిమానులు అలాగే టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు.

Telugu Bramhini, Chandrababu, Lokesh, Tollywood-Latest News - Telugu

ఇటువంటి సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara lokesh )ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ త‌న భార్య బ్రాహ్మ‌ణికి రాజ‌కీయాలంటే ఇష్టం లేదు అంటూ బాంబు పేల్చారు.కానీ బ్రాహ్మణి రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం నారా లోకేష్ కి ఇష్టం లేదు అన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఆమె రాకను లోకేశ్ మొగ్గ దశలోనే తుంచి వేస్తున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

తన భార్య బ్రాహ్మ‌ణి రాక‌తో రాజ‌కీయాల్లో త‌న‌ను ప‌ట్టించుకోర‌నే భ‌యం లోకేశ్‌ను వెంటాడుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబుని అరెస్ట్ చేసి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో పెట్టారు.

Telugu Bramhini, Chandrababu, Lokesh, Tollywood-Latest News - Telugu

గత 23 రోజులుగా ఆయ‌న జైలు జీవితాన్ని గ‌డుపుతున్నారు.అంతేకాకుండా జైలు నుంచి బాబు ఎప్పుడు బ‌య‌టికొస్తారో చెప్ప‌లేని ప‌రిస్థితి.మ‌రోవైపు ప‌లు కేసుల్లో లోకేశ్‌ను నిందితుడిగా చేర్చ‌డాన్ని చూస్తున్నారు.అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డులో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ లోకేశ్‌ను( Nara lokesh ) 14వ నిందితుడిగా చేర్చారు.

ఈ కేసులో నాల్గో తేదీన లోకేశ్ విచార‌ణ ఎదుర్కోనున్నారు.ఏదో ఒక కేసులో లోకేశ్ అరెస్ట్ కావ‌డం ఖాయ‌మ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube