కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లోని( Los Angeles ) USC అన్నెన్‌బర్గ్ స్కూల్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో తాజాగా ఓ కార్యక్రమం జరిగింది.దీనికి టర్కీ దౌత్యవేత్తలు( Turkish Diplomats ) హాజరయ్యారు.
అయితే వారితో పాటు అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిపై ఆర్మేనియన్ నిరసనకారులు దాడి చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో నిరసనకారులు బ్లాక్ సూట్స్‌లో ఉన్న పురుషులను కొట్టడం, నీళ్లు పోయడం, నీళ్ల బాటిళ్లతో కొట్టడం కనిపించింది.ఈ ఘటనలో బాధితులు టర్కిష్ ఎంబసీ సభ్యులు అని తెలిసింది.
ఆర్మేనియన్ నిరసనకారుల్లోని( Armenian Protesters ) ఒక సభ్యుడు “షేమ్ ఆన్ టర్కీ” అనే బోర్డుని పట్టుకుని కనిపించాడు.

“USC కాలిఫోర్నియా అన్నెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ జర్నలిజం, యూనస్ ఎమ్రే ఇన్‌స్టిట్యూట్‌లో టర్కీ పబ్లిక్ డిప్లమసీ సదస్సుకు హాజరైన అమెరికా రాయబారి, ఎంబసీ సిబ్బందిపై ఆర్మేనియన్లు దాడి చేశారు.” అని వైరల్ వీడియోకి క్యాప్షన్ పెట్టారు.ఈ ఘటనను సోషల్ మీడియాలో చాలామంది తీవ్రంగా ఖండించారు.<div class=”middlecontentimg”> కాలిఫోర్నియాలో
టర్కీ దౌత్యవేత్తలు, సిబ్బందిపై దాడిపై గురించి లాస్ ఏంజిల్స్‌లోని టర్కిష్ కాన్సులేట్ జనరల్( Turkish Consulate General ) ఇంకా స్పందించలేదు.ఇటీవల ఆర్మేనియాపై యుద్ధంలో అజర్‌బైజాన్( Azerbaijan ) విజయం సాధించారు.
ఆపై టర్కీ అధ్యక్షుడు అజర్‌బైజాన్ అధ్యక్షుడిని కలుసుకుని అభినందనలు తెలిపారు.దీని తర్వాత కాలిఫోర్నియాలో ఆ దాడి చోటు చేసుకుంది.







