ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా భారత వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా వన్డే వరల్డ్ కప్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది.
ఇప్పటికే అన్ని జట్లు భారత గడ్డపై ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతున్నాయి.
కొంతమంది మాజీ క్రికెట్ క్రికెటర్లు రివ్యూలు మీద రివ్యూలు ఇస్తూ.వరల్డ్ కప్ చర్చ ను హార్ట్ టాపిక్ గా మార్చేశారు.ఏ జట్టు సెమీఫైనల్ కు చేరుతుందో.
ఏ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడుతుందో ముందే అంచనాలు వేస్తూ ఉండడంతో క్రికెట్ అభిమానులంతా సోషల్ మీడియా లో జరిగే చర్చపై ఆసక్తికర కామెంట్లు కూడా చేస్తున్నారు.అయితే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయినా కొన్ని అరుదైన రికార్డులు అలాగే ఉన్నాయి.
ఆ అరుదైన రికార్డులు ఏమిటో తెలుసుకుందాం.సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar ) 2003 ప్రపంచ కప్ లో 11 మ్యాచులు ఆడి 673 పరుగులు చేశాడు.
ఈ రికార్డ్ ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు.
ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మెక్ గ్రాత్( Glenn McGrath ) 71 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు.ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్( Chris Gayle ) కొనసాగుతున్నాడు.ప్రపంచ కప్ లో ఏకంగా 49 సిక్సర్లు కొట్టాడు.
ఇక ప్రపంచ కప్ లో అత్యంత స్లో ఇన్నింగ్స్ ఆడిన ప్లేయర్ గా సునీల్ గవాస్కర్ కొనసాగుతున్నాడు.ఇతను 174 బంతుల్లో కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ క్రికెటర్లు క్రియేట్ చేసిన అరుదైన రికార్డులు ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు.కనీసం వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనైనా ఈ రికార్డులు బ్రేక్ అవుతాయేమో చూడాలి.