రేపు జరగాల్సిన తెలంగాణ-కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం వాయిదా పడింది.దీంతో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.
పార్టీలో కీలక నేత మురళీధరన్ అందుబాటులో లేకపోవడంతో స్క్రీనింగ్ కమిటీ సమావేశం వాయిదా పడింది.ఈ క్రమంలో అక్టోబర్ 4 లేదా 6వ తేదీన టీ -కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్క్రీనింగ్ కమిటీ భేటీ తరువాత అభ్యర్థుల నివేదిక సీఈసీకి వెళ్లనుంది.ఈ నేపథ్యంలో సీఈసీ భేటీలో కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా ఖరారు కానుంది.
ఈ అభ్యర్థుల ఫైనల్ లిస్టును ఏఐసీసీ ప్రకటించనుందన్న విషయం తెలిసిందే.