ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'సలార్' ఆ స్థాయిలో రిలీజ్.. ఇది ప్రభాస్ స్టామినా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తుంటే అంత లేట్ అవుతున్నాయి.ఎన్నో వాయిదాల తర్వాత రిలీజ్ అయిన ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ అయ్యింది.

 Prabhas Salaar To Release In 1979 Locations In Usa,prabhas,salaar,prashanth Neel-TeluguStop.com

ఈ సినిమా తర్వాత సెప్టెంబర్ ఎప్పుడు వస్తుందా సలార్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూడసాగారు.

కానీ సలార్ కూడా వాయిదాల పర్వంమే కొనసాగుతుంది.ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాకు ముందు నుండి భారీ డిమాండ్ ఉంది.ఈ సినిమా ప్రకటించగానే అంచనాలు పెరిగాయి.

ఎందుకంటే నీల్ కెజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమాను స్టార్ట్ చేసాడు.

అందుకే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ ఖాయం అనే హోప్స్ ను ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) పెట్టుకున్నారు.

కానీ ఇది సెప్టెంబర్ వాయిదా పడడంతో డీలా పడ్డారు.ఆ తర్వాత ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చింది.

డిసెంబర్ 22న ఈ సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వనుంది.

ఈ సినిమా నుండి అతి త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కానున్నాయి.కాగా ఈ సినిమాను యూఎస్ లో దాదాపు 1979 కి పైగానే లొకేషన్స్ లో గ్రాండ్ గా రిలీజ్( Salaar Grand Release ) కానుందని అఫిషియల్ తెలిపారు.మరి ఈ స్థాయిలో ఏ ఇండియన్ సినిమా కూడా ఇంత వరకు రిలీజ్ అవ్వలేదు.

మరోవైపు బాలీవుడ్ మూవీ, హాలీవుడ్ మూవీ పోటీలో ఉన్న ఈ స్థాయిలో రిలీజ్ చేయడంతో ప్రభాస్ స్టామినా తెలుస్తుంది.దీంతో ఓపెనింగ్స్ తోనే రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube