తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రజాకర్షణ నిర్ణయాలతో అనేక స్కీములతో ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్( Congress ) మాత్రం అనేక స్కాములకు పాల్పడుతుందని కేటీఆర్ ( Minister KTR ) విమర్శించారు.వనపర్తి 10 ఏళ్ల ప్రగతి మహాసభ లో పాల్గొన్న కేటీఆర్ ప్రత్యర్థి పార్టీలపై తనదైన విమర్శలు చేశారు.
ఆ పార్టీలో చెప్పే గ్యారంటీలు అన్ని వారంటీలు లేని వని , కాంగ్రెస్ను నమ్మితే 24 గంటల కరెంటుకు బదులు మూడు గంటలు కరెంటు రావడం ఖాయమని, నల్లా నీళ్లు కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.భాజపాపై( BJP ) కూడా ఆయన తనదైన విమర్శలు చేశారు.

తెలంగాణ అంటే మోడీకి( PM Modi ) ఎందుకు ఇంత కక్ష అంటూ ఆయన ప్రశ్నించారు.వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా కోసం రెండు సార్లు తీర్మానపత్రం పంపించినా కేంద్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా మన ప్రమేయం ఉంటేనే పనులు జరుగుతాయని అందువల్ల ఎమ్మెల్యే అభ్యర్థులకే కాకుండా ఎంపీ సీట్లను కూడా తగిన స్థాయిలో ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తున్న మోదీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ అభివృద్ది పై మీ చిత్తశుద్ది ఎంతో ప్రజలకు తెలుసు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మా ప్రబుత్వం వచ్చిన తర్వాతే పాలమూరు లో( Palamuru ) వలసలు ఆగాయని లక్షల మంది ఇతర దేశాలకు వలస పోతున్నా గత ముఖ్యమంత్రులు ఎవరూ కనీసం తిరిగి చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు గత ప్రభుత్వాలు 65 సంవత్సరాల లో చేయలేని పనులను మన ప్రభుత్వం ఐదు సంవత్సరాలలోనే చేయగలిగిందని వనపర్తి నియోజకవర్గంలో( Wanaparthy ) 1.25 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి అంటే అది స్థానిక ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,సీఎం కేసీఆర్ ల సంకల్పం వల్లే సాధ్యమైందని రానున్న అసెంబ్లీ ఎన్నికలలో నిరంజన్ రెడ్డి ని బారీ మెజారిటీతో గెలిపించాలంటూ ఆయన కోరారు.







