ఏపీలో రాజకీయ పరిణామాలు విచిత్రమైన మలుపులు తీసుకుంటున్నాయి.అధికార పార్టీ చూపిస్తున్న దూకుడు రాజకీయ పరిణామాలు కదులుతున్న వేగం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలను కుదురుకోనివ్వడంలేదనే సూచనలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) తరువాత వరసగా కోర్టులలో వ్యతిరేక తీర్పులు రావడం, మరోపక్క లోకేష్( Nara Lokesh ) అరెస్టుకు ఏపీ సిఐడి రంగం సిద్ధం చేయడం, లోకేష్ బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించడం వంటి పరిణామాలు తెలుగుదేశానికి కష్టాలు ఇంకా తొలిగిపోలేదనే సూచనలు కనిపిస్తున్నాయి అయితే అన్నిటికంటే పెద్ద సమస్యగా ఇప్పుడు జనసేన- తెలుగుదేశం కార్యకర్తల సమైక్యత అన్నది వినిపిస్తున్న వార్తల సమాచారం.

ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జనసేన( Janasena ) కీలక కార్యకర్తలకు తెలుగుదేశం తమ్ముళ్లకు గత రెండు రోజులుగా దాదాపు యుద్దం జరుగుతుంది.జనసేనకు మద్దతుగా ఉండే వకీల్ సాబ్ కళ్యాణ్ దిలీప్ సుంకర( Kalyan Dileep Sunkara ) చంద్రబాబుపై చేసిన ఒక వీడియో ఈ వివాదానికి ఆద్యం పోసినట్టుగా తెలుస్తుంది.దానిపై తెలుగుదేశం నేత మహాసేన రాజేష్( Mahasena Rajesh ) ఘాటు స్పందన ఆ తరువాత జరిగిన పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల నేతలు రెండు వర్గాలుగా విడిపోయి దూషించుకోవడం మొదలుపెట్టారు.
అయితే ముందుగా డామేజ్ కంట్రోల్ కు దిగిన జనసేన పార్టీ నాయకత్వం మెగా బ్రదర్ నాగబాబు పేరు మీదుగా ఒక లెటర్ ను రిలీజ్ చేశారు.

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తలను అభినందిస్తూనే పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదని కచ్చితంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారినపై జీరో టోలరెన్స్ విదానాన్ని అవలంబిస్తామంటూ ఒక చిన్నపాటి హెచ్చరికను నాగబాబు( Nagababu ) జారీ చేశారు.ఇది కళ్యాణ్ దిలీప్ సుంకర ను ఉద్దేశించే అని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కార్యకర్తలతో కనీస చర్చలు లేకుండా పొత్తును ప్రకటించి ఇప్పుడు బలవంతపు సంసారం చేయమన్నట్లుగా జనసేన అధిష్టానం పద్ధతి ఉందంటూ కొంతమంది జనసేన కార్యకర్తలే తమ అధిష్టానం పై విమర్శలు చేయడం గమనార్హం.
ఈ విషయం లో జనసెన హార్డ్ కోర్ ఫాన్స్ కూడా కళ్యాణ్ దిలీప్ కి సపోర్ట్ చేయడం గమనార్హం .