భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడే భారత జట్టు ఫుల్ ఫామ్ కొనసాగిస్తూ, వరల్డ్ కప్ కు ముందు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.ఈ మధ్య జరిగిన ఆసియా కప్ తో పాటు ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని ఫుల్ జోష్ లో ఉంది.
భారత జట్టు దూకుడు చూస్తుంటే ఈసారి కచ్చితంగా వన్డే వరల్డ్ కప్ టైటిల్ భారత్ ఖాతాలో పడే అవకాశం ఉంది.గత కొంతకాలంగా సీనియర్ మరియు జూనియర్ ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తున్నారు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.భారత జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్, హార్థిక్ పాండ్యా సూపర్ ఫామ్ లో ఉన్నారు.బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్, బుమ్రా, మహమ్మద్ షమీ అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తున్నారు.
వీరికి సపోర్ట్ గా కేఎల్ రాహుల్ ఇషాన్ కిషన్ వంటి వారు సైతం ఉత్తమ ప్రదర్శనతో రాణిస్తూ ఉండడంతో భారత జట్టు తిరుగులేని జట్టుగా వన్డే వరల్డ్ కప్ ఆడబోతోంది.

రోహిత్ శర్మ( Rohit Sharma ) ఇప్పటివరకు 250 మ్యాచులు ఆడి ఏకంగా 10031 పరుగులు చేశాడు.ఇందులో 30 సెంచరీలు, 51 అర్థ సెంచరీలు ఉన్నాయి.అంతేకాదు వన్డేలలో మూడు డబల్ సెంచరీలు చేసిన రికార్డ్ రోహిత్ పేరిట ఉంది.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 280 మ్యాచులు ఆడి ఏకంగా 13027 పరుగులు చేశాడు.ఇందులో 47 సెంచరీలు 65 అర్థ సెంచరీలు ఉన్నాయి.శుబ్ మన్ గిల్( Shubman Gill ) ఇప్పటివరకు 33 మ్యాచ్లు ఆడి 1917 పరుగులు చేశాడు.ఆరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే గిల్ అద్భుత ఆటను ప్రదర్శించాడు.
హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 82 మ్యాచులు ఆడి 1758 పరుగులు చేసి 11 అర్థ సెంచరీలు నమోదు చేశాడు.బౌలింగ్ లో కూడా భారత జట్టుకు తన వంతు సపోర్ట్ చేస్తున్నాడు.

ఇక బౌలర్ల విషయానికి వస్తే.మహమ్మద్ సిరాజ్ వన్డే ర్యాంకింగ్ లో నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు.బుమ్రా( Jasprit Bumrah ) యార్కర్ కింగ్ గా పేరుగాంచి బౌలింగ్ తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు.ప్రస్తుత అంచనాల ప్రకారం 2023 వన్డే వరల్డ్ కప్ టైటిల్ భారత్ కే దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.








