మరో స్కాం లోనూ చంద్రబాబు పాత్ర ! 'సజ్జల' సంచలన ఆరోపణలు

టిడిపి అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు,  వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala ramakrishna reddy ) సంచలన ఆరోపణలు చేశారు.స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో పాటు,  ఫైబర్ గ్రిడ్ స్కాం లోను చంద్రబాబు పాత్ర ఉందని సజ్జల సంచలన రోపణలు చేశారు.

 Chandrababu's Role In Another Scam Sajjala Ramakrishna Reddy Sensational Allega-TeluguStop.com

ఇక చంద్రబాబు అరెస్టుపై ఏపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల పైన సజ్జల స్పందించారు .స్కిల్ డెవలప్మెంట్ స్కాం దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం ఏముంటుందని సజ్జల ప్రశ్నించారు.డిజైన్ టెక్ ద్వారా కోట్లు కొట్టేసారని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.  లక్ష మంది గోబల్స్ కలిస్తే చంద్రబాబు అవుతారని సజ్జల విమర్శించారు .చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని , తాము ప్రచారం చేసే అసత్యాలను జనం నమ్మక చస్తారా అని టిడిపి భావిస్తూ ఉందని విమర్శించారు.తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన సజ్జల చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.

అడ్డంగా దొరికిన దోపిడీ దొంగల ముఠాకు ఎల్లో మీడియా సపోర్ట్ చేస్తుందని విమర్శించారు .

Telugu Ap, Ap Skil Scam, Fiber Grid Scam, Jagan, Lokesh, Skil Scam-Politics

 ఎల్లో మీడియాకు వాస్తవాలతో సంబంధం లేదని విమర్శించారు.చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారని,  అవినీతికి పాల్పడిన చంద్రబాబును అరెస్ట్ చేస్తే అదేదో ప్రజా జీవితానికి పెద్ద అగాధం కలిగినట్లుగా ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ అంటే తోడు దొంగల పార్టీ అని,  ఈ తోడు దొంగల పార్టీకి ముఠా నాయకుడు చంద్రబాబు అని సజ్జల విమర్శించారు.

స్కిల్ స్కాం లో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని,  ఢిల్లీలో నారా లోకేష్( Nara lokesh ) కు పనేంటి అని ఆయన నిలదీశారు .ఈ 20 రోజుల్లో లోకేష్  ముఠా నాన యాగి చేస్తోందని , ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైందని సజ్జల ఆరోపించారు.

Telugu Ap, Ap Skil Scam, Fiber Grid Scam, Jagan, Lokesh, Skil Scam-Politics

సాక్షాదారాలతో దొరికితే కోర్టు రిమాండ్ కు పంపిందని,  అయినప్పటికీ జరిగిన స్కాం పై వీరంతా మాట్లాడడం లేదని , దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube