ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటి అందాల తార శ్రీదేవి( Sridevi ) ఒకరు.ఇక ఈమె మరణ వార్త ఇండస్ట్రీకి ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి.
ఇక ఈమె మరణం తర్వాత తన వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి జాన్వీ కపూర్( Janhvi Kapoor ) . ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె ఇప్పటివరకు వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.అయితే మొదటిసారి ఈమె ఎన్టీఆర్ సరసన సౌత్ ఇండస్ట్రీకి కూడా హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దొరికేకుతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో హీరోయిన్గా కొరటాల శివ ఈమెకు అవకాశం కల్పించారు.ఎన్టీఆర్ సినిమాలో భాగం అవ్వాలని ఎప్పటినుంచో కలలు కంటున్నటు వంటి జాన్వీ కోరిక కూడా దేవర ( Devara ) సినిమాతో నెరవేరింది అని చెప్పాలి.
ఇక ఈమె కూడా ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉంటున్నారు.
సముద్రపు బ్యాక్ గ్రౌండ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇందులో ఎన్టీఆర్ ( NTR ) కి పోటీగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali khan ) విలన్ పాత్రలో నటిస్తున్నారు.ప్రస్తుతం సర్వే గంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నటువంటి ఈ సినిమా కోసం నటి జాన్వి కపూర్ చేసిన పని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా చేయనటువంటి పని జాన్వీ కపూర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
ఎన్టీఆర్ తో నటించాలన్న కోరిక నెరవేరడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి ఈమె ఈ సినిమా షూటింగ్ ఒక ప్రతిరోజు ముంబై నుంచి హైదరాబాద్ రావాలి అంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారట ఈ ఇబ్బంది కారణంగా తాను ఎక్కడ సినిమాపై కాన్సన్ట్రేషన్ చేయలేక పోతానేమోనని భావించి ఈమె ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.తన వల్ల ఎన్టీఆర్ సినిమాకు చెడ్డ పేరు రాకూడదు అన్న ఉద్దేశంతోనే ఈమె హైదరాబాద్లో రాత్రికి రాత్రి ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తుంది.ఇలా హైదరాబాద్లో తనకంటూ సొంత ఇల్లు ఉంటే చాలా ప్రశాంతంగా షూటింగ్ పనులపై కాన్సన్ట్రేషన్ చేయవచ్చు అన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసి ఎన్టీఆర్( NTR ) కూడా ఈమె సినిమా పట్ల చూపిస్తున్నటువంటి డెడికేషన్ కు ఫిదా అవుతున్నారు.