డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల(Sreekanth Addala) దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ అయి చాలా కాలం అయింది ఈయనకు ఈ మధ్యకాలంలో సక్సెస్ సినిమాలు లేకపోవడంతో ఫెయిడౌట్ దర్శకులలో ఒకరిగా మిగిలిపోయారు.అయితే తాజాగా తనని తాను నిరూపించుకోవడం కోసం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొత్త హీరో హీరోయిన్లతో పెదకాపు 1 (Peddha Kapu 1) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల నటించడం విశేషం అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్ టీజర్ సినిమాపై భారీ అంచనాలనే పెంచేసాయి.మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంది.అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
కథ:
1980 దశకంలో ఒక గ్రామంలో కులాల మధ్య రేగినటువంటి చిచ్చు రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది.ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.రాజమండ్రి సమీపంలోని ఓ ఊరిలో పెద్ద కాపు(విరాట్ కర్ణ)( Virat Karrna ) అందరికీ పెద్ద దిక్కుగా ఉండేవాడు.
కాగా ఆయన రెండు పవర్ సెంటర్ల అనిచివేత విషయంపై పోరాటం చేస్తూ ఉంటారు.
ఈయనకు వ్యతిరేకంగా సత్య రంగయ్య (రావు రమేష్), భయ్యన్న (ఆడుకలం నరేన్) ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు.అయితే ఎన్టీ రామారావు 1982లో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయ పరిస్థితులు ఎలాంటి మార్పులు వచ్చాయి
సత్య రంగయ్య బయన్న వంటి వారిని ఎదుర్కొని పెద కాపు ఎలా అన్నింటిని సెట్ చేశారు అన్న విషయాలు తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో అక్కమ్మ (అనసూయ)( Anasuya ) ఎవరు, ఆమె ప్రమేయం ఎలా ఉంటుంది అనేది థియేటర్లలో చూడాల్సిందే.
నటీ నటుల నటన:
ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైనటువంటి విరాట్ కర్ణ పాత్రలో బాగానే నటించాడు.అనుభవం ఉన్న నటుడిగా ఈ సినిమాలో నటించి పర్వాలేదనిపించుకున్నారు.ఇక స్వార్థపూర్వక రాజకీయ నాయకుడిగా రావు రమేష్( Rao Ramesh ) తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారు.ప్రగతి శ్రీవాస్తవ బాగానే నటించింది.తనికెళ్ల భరణి , నాగబాబు బాగా ఆకట్టుకున్నాకరు.ఇక అనసూయ, రాజీవ్ కనకాల, వంటి వారందరూ కూడా వారి పాత్రలకు అనుగుణంగా నటించి మెప్పించారు.
టెక్నికల్:
విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ అంతా అద్భుతంగా ఉంది అయితే కథలో కొంచెం కంటెంట్ లేదనే చెప్పాలి.ఒక గ్రామంలో కులమత రాజకీయాలను ఆధారంగా చేయాలని శ్రీకాంత్ మంచి ప్రయత్నమే చేసినప్పటికీ కథ మాత్రం అంత బలంగా లేదని చెప్పాలి.
సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టెక్నికల్ గా దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జే మేయర్( Mickey J Mayer ) పూర్తిగా విఫలమయ్యారని తెలుస్తోంది.
విశ్లేషణ:
పెద కాపు( Peddha Kapu ) లాంటి కథ నేపథ్యంలో ఒక గ్రామంలో కులమత రాజకీయాల గురించి ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.అయితే ఈ సినిమా కూడా అదే స్థాయిలోనే ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా మెప్పించలేకపోయింది అదే గొడవలు అదే సీన్స్ రిపీట్ అయ్యాయని అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన కొన్ని యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.
మైనస్ పాయింట్స్:
మ్యూజిక్, ఆకట్టుకోలేకపోయిన సీన్స్, కథలో కంటెంట్ లేకపోవడం.
బాటమ్ లైన్:
శ్రీకాంత్ మొదటిసారి ఇలా కులమత రాజకీయాలకు సంబంధించిన కథను ఎంపిక చేసుకున్నప్పటికీ ఈ కథలో కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా నిరాశపరిచిందని చెప్పాలి.