నీడలా బాబును వెంటాడుతున్న ప్రభుత్వం!

అరెస్టు జరిగిన దగ్గర నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు( Chandrababu Naidu ) చట్టప్రకారం ఏ రకమైన వెసులుబాటు ఇంతవరకూ కలగలేదు.గత 20 రోజులుగా ఆయన జైలులో గడుపుతున్నా ఇప్పటివరకు ఆయనకు బెయిల్ అయితే దొరకలేదు .

 The Ap Government Is Chasing Chandrababu Like A Shadow Details, Chandrababu Naid-TeluguStop.com

ఇందులో ఇంకో కోణం ఏమిటంటే బెయిల్ కోసం తెలుగుదేశం లీగల్ గట్టిగా ప్రయత్నించి ఉంటే ఈపాటికి చంద్రబాబు రిలీజ్ అయి ఉండేవారని ఆయన బెయిల్ తీసుకుంటే ఈ కేసులో నిందితుడునని పరోక్షంగా ఒప్పుకున్నట్లు అవుతుందన్న ఉద్దేశంతోనే బాబు కేసును పూర్తిగా కొట్టివేయమంటూ కోర్టులో గట్టిగా ప్రయత్నిస్తున్నారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్ర చూడ్ కూడా అసలు బాబుకి ఏం కావాలంటూ లుధ్రా ను ప్రశ్నించడం గమనార్హం.

Telugu Ap, Cash, Chandrababu, Supreme-Telugu Political News

బెయిల్ ఇవ్వాలా? అన్న ప్రశ్నకు వద్దని క్వాష్ పిటిషన్ తొందరగా విచారణ చేయాలంటూ లుధ్రా( Luthra ) రిక్వెస్ట్ చేశారు.దీనిని బట్టి నిర్దోషిగా ఈ కేసుల్లో బయటపడటానికే తెలుగుదేశం అధినేత అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది.కొంత లేట్ అయినా జైల్లోనే ఉంటానని కచ్చితంగా నిర్దోషిగానే బయటికి వెళ్లాలని పట్టుదల చూపించడం వల్లే బాబుకు జైలు జీవితం తప్పడం లేదన్నది లీగల్ విశ్లేషకుల మాట .అయితే లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే తెలుగుదేశం( TDP ) సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ కు పోటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేవీయట్ పిటిషన్ ను దాఖలు చేయడం.

Telugu Ap, Cash, Chandrababu, Supreme-Telugu Political News

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు వినేటప్పుడు తమ వాదన కూడా వినాలంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం( AP Govt ) ఈ పిటిషన్ వేసినట్లుగా తెలుస్తుంది.దాంతో బలమైన ప్రాథమిక ఆధారాలు ఉండి విచారణ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేసు విచారణ సజావుగా జరిగాలంటే క్వాష్ ను అంగీకరించవద్దని సుప్రీంకోర్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరే అవకాశం ఉంది.దాంతో ఎన్నికల చివరి వరకు బాబుకు రిలీఫ్ దొరకటం కష్టమే అంటూ విశ్లేషణలు వస్తున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube