కస్టమర్లకు డిజిటల్ లైసెన్స్ ప్లేట్లను( Digital License Plates ) అందిస్తున్న మొదటి కారు కంపెనీగా ఫోర్డ్( Ford ) చరిత్ర సృష్టించింది.ఈ మేరకు ఫోర్డ్ డిజిటల్ లైసెన్స్ ప్లేట్‌లను తయారు చేసే కాలిఫోర్నియాకు చెందిన రివైవర్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
వాహనదారులు ఇప్పుడు ఫోర్డ్ డీలర్‌షిప్‌లు లేదా ఫోర్డ్ వెబ్‌సైట్ నుంచి డిజిటల్ లైసెన్స్ ప్లేట్లను కొనుగోలు చేయవచ్చు.ప్రస్తుతానికి ఈ ప్లేట్లు అరిజోనా, కాలిఫోర్నియా, మిచిగాన్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి, అయితే అవి మొత్తం 50 యూఎస్ రాష్ట్రాలు, కెనడా, మెక్సికోలలో చట్టబద్ధమైనవిగా ఉంటాయి.
డిజిటల్ లైసెన్స్ ప్లేట్లు వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్ విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి.

రివైవర్( Reviver ) అభివృద్ధి చేసిన డిజిటల్ లైసెన్స్ ప్లేట్‌ను RPlate అంటారు.RPlate డిజిటల్ లైసెన్స్ ప్లేట్ కస్టమర్లకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.వాటిలో కస్టమైజ్డ్ ఇ-ఇంక్ స్క్రీన్ ఒకటి.
RPlate మోనోక్రోమ్ ఇ-ఇంక్ స్క్రీన్‌ను కలిగి ఉంది, దానిని పర్సనలైజ్డ్ మెసేజ్‌లతో కస్టమైజ్ చేసుకోవచ్చు.ఇందులోని ఆటోమేటిక్ రెన్యువల్ ఫీచర్ స్టిక్కర్ల అవసరాన్ని తొలగిస్తూ కస్టమర్లు తమ వాహన రిజిస్ట్రేషన్‌ను RPlate మొబైల్ యాప్ ద్వారా రెన్యువల్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
రియల్-టైమ్ అలర్ట్స్( Real Time Alerts ) కూడా పొందవచ్చు.వాహనం దొంగిలించబడినా లేదా అనుమతి లేకుండా తరలించబడినా RPlate వినియోగదారులకు రియల్-టైమ్ అలర్ట్స్ పంపగలదు.

ఆర్‌ప్లేట్( RPlate ) కోసం యాన్యువల్ సర్వీస్ ఫీజు 75 డాలర్లతో పాటు 599 డాలర్లు చెల్లించాలి.కమర్షియల్ వెహికల్స్ కోసం RPlate హార్డ్‌వైర్డ్ వెర్షన్ కూడా ఉంది, దీని కోసం 150 డాలర్ల ఇన్‌స్టాలేషన్ ఫీజు, 95 డాలర్ల యాన్యువల్ సర్వీస్ ఫీజుతో పాటు 749 డాలర్లు పే చేయాలి.ఆర్‌ప్లేట్‌లోని బ్యాటరీ ఐదేళ్లపాటు వస్తుందని అంచనా.రివైవర్, చాంప్ టైటిల్స్ వంటి కంపెనీలు పేపర్‌వర్క్‌ను తగ్గించడం, ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేయడం ద్వారా కారును ఫుల్లీ డిజిటలైజ్ చేయడానికి కృషి చేస్తున్నాయి.
భవిష్యత్తులో వర్చువల్ వాలెట్‌లు, డిజిటల్ టోలింగ్ వంటి మరిన్ని డిజిటల్ ఫీచర్‌లను కార్లలో చూడొచ్చు.







