ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్( Anirudh ) ఒకరు.ఈయన చిన్న వయసులోనే సంగీతం దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు తాజాగా ఈయన సంగీత సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి జైలర్ ( Jailer )జవాన్ సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అందుకున్నాయో మనకు తెలిసిందే.
ఈ సినిమాల ద్వారా అనిరుద్ మరోసారి తన మ్యూజిక్ తో అందరిని మ్యాజిక్ చేశారు.ఇక ప్రస్తుతం ఈయన లియో సినిమా (Leo Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
అదే విధంగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర( Devara ) సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇంత చిన్న వయసులోనే అద్భుతమైన మ్యూజిక్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.తాజాగా ఈయన లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో హీరో విజయ్ నటించి లియో సినిమా( LEO movie) లిరిక్ వీడియో ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోతుంది అయితే ఇందుకు సంబంధించి ఒక వీడియోని మేకర్స్ విడుదల చేశారు.ఇక ఈ వీడియోకి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ కాపీ చేశారు అంటూ పెద్ద ఎత్తున ఈ వీడియో ట్రోల్ మొదలుపెట్టారు.
అనిరుద్ ఒకానొక సమయంలో బుల్లితెరపై ఎంతో ఫేమస్ అయినటువంటి మొగలిరేకులు ( Mogalirekulu ) సీరియల్ నుంచి ఈ మ్యూజిక్ కాపీ కొట్టారు అంటూ నేటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.ఈ వీడియోకి అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ సోర్స్ అచ్చం మొగలిరేకులు సీరియల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు వెహికల్ లో వెళ్తున్న సమయంలో ఇలాంటి బ్యాగ్రౌండ్ సోర్స్ అందించారు.అదే మ్యూజిక్ అనిరుద్ ఇప్పుడు ఈ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా అందించారని ఈ సీరియల్ నుంచి ఈయన మ్యూజిక్ కాపీ కొట్టారు అంటూ భారీ స్థాయిలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.