వంగ పంట( Brinjal )కు వివిధ రకాల చీడపీడల, తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.సకాలంలో గుర్తించి తొలి దశలోనే అరికడితే మంచి దిగుబడి పొందవచ్చు.
అయితే వంగ పంటకు కొమ్మ మరియు కాయ తొలిచూపులు ఆశిస్తే ఇక తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిందే.ఈ పురుగులు వంగ పంట ను ఆశించి కొమ్మలు, పువ్వులు, పువ్వు మొగ్గలు మరియు కాయలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
ఖరీఫ్( Kharif crop ) లో పంటను సాగు చేసినట్లయితే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ కాయ తొలుచు పురుగులను పంట పొలంలో గుర్తించవచ్చు.వంగ కాయ లోపలికి ప్రవేశించి లోపలి భాగాన్ని ఆహారంగా తినేస్తుంది.
ఈ పురుగుల ఉధృతి పెరిగితే కొమ్మలు వాడిపోవడం, మొక్కలు బలహీన పడటం జరుగుతుంది.ఇక పువ్వు మొగ్గలు కూడా వాడిపోయి రాలిపోతాయి.
తొలి దశలో ఒక ఎకరం పొలంలో పది లింగాకర్షణ బుట్టలు పెట్టి వీటి ఉధృతి పెరగకుండా నివారించవచ్చు.గూగుల్ ఆశించిన కొమ్మలు వాడినట్లు కనిపిస్తే ఒక్క అంగుళం కిందికి ఆ కొమ్మను తుంచి నాశనం చేయాలి.లేదంటే పురుగులు ఆశించిన కొమ్ములను తుంచి పంట పొలానికి దూరంగా పడేయాలి.
రసాయన పిచికారి మందులైన ప్రోఫినోఫాస్( Profinophos ) 50EC @2మి.లీ ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG @ 0.4గ్రా ను ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.వాడిన మందులను ఎక్కువసార్లు వాడకుండా మందులను మారుస్తూ పిచికారి చేస్తే ఫలితం ఆశించిన స్థాయిలో ఉంటుంది.
అయితే ఈ పురుగులకు చెందిన లార్వా మొక్క పై భాగంలో కాకుండా లోపలి భాగంలో నివాసం ఉండి నాశనం చేసే స్వభావం కలది కాబట్టి విచక్షణారహితంగా ఇచికారి మందులు చేయకూడదు.తొలి దశలో అరికట్ట లేకపోతే ఇక ఎన్ని పిచికారి మందులు కొట్టిన ఫలితం ఉండదు.