పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా రాజకీయాలలో ఏమాత్రం తనకు కాళీ సమయం దొరికిన వెంటనే తన సినిమా షూటింగులకు హాజరవుతూ మరోవైపు సినిమాలను ఫినిష్ చేసే పనిలో కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఈయన ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరు మల్లు, ఓజి సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagath Singh ) సినిమాలో ఈయన ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని మనకు తెలుస్తుంది.

ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ అదే పోలీస్ డ్రెస్ లో జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్లారు.అయితే అక్కడ పెద్ద ఎత్తున జనసేన పార్టీకి అభిమానులు విరాళాలు అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో వెహికల్ స్టంట్ మాస్టర్( Vehicle Stunt Master ) గా పనిచేస్తున్నటువంటి బద్రి( Badri ) పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనకు విరాళం అందజేశారు.తాజాగా బద్రి భోళా సినిమాకు ( Bhola Shankar ) వెహికల్స్ స్టంట్ మాస్టర్ గా పనిచేశారు ఈ సినిమాకు కాను ఆయన పని చేసినందుకు 50 వేల రూపాయల రెమ్యూనరేషన్ ( Remuneration ) ఇచ్చారు.

ఈ విధంగా ఈ సినిమాకు ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ బద్రి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆ విరాళాన్ని జనసేన పార్టీ( Janasena Party) కి అందజేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.ఇక బద్రి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.తెలుగు సినిమాలలో వెహికల్ స్టంట్ మాస్టర్ గా పనిచేసేది మన బద్రి అని ఈయన ఏమాత్రం భయపడకుండా ఎంతో అద్భుతంగా స్టంట్ చేయడం ఈయనకు మాత్రమే సాధ్యమైందని తెలిపారు.
ఇక సినిమా కోసం పనిచేయగా వచ్చిన రెమ్యూనరేషన్ జనసేన పార్టీకి విరాళంగా అందించడంతో పవన్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ తనకు కృతజ్ఞతలు తెలియజేశారు.







