తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannath) నేడు తన 57వ పుట్టినరోజు(Birthday) వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఇక నేడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే పూరి జగన్నాథ్ పుట్టినరోజు కావడంతో ఆయన ప్రొడక్షన్ హౌస్ పార్టనర్ అయినటువంటి నటి చార్మి(Charmi) అర్ధరాత్రి పూరి జగన్నాథ్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇలా పూరి జగన్నాథ్ ముందు కేక్స్ ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇవి శాశ్వతమైన సెలబ్రేషన్స్ అంటూ ఈమె ఈ ఫోటోలకు ఒక క్యాప్షన్ పెట్టారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.ఇక చార్మి పూరి జగన్నాథ్ ఇద్దరు కూడా నిర్మాతలుగా సినిమాలను నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇలా వర్క్ పరంగా వీరిద్దరూ ఎక్కువగా ముంబైలోనే( Mumbai ) ఉంటున్నారు.
ఈ క్రమంలోని వీరిద్దరే రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

ఇక వీరిద్దరి రిలేషన్ గురించి కూడా బండ్ల గణేష్( Bandla Ganesh ) పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఇలా వీరి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన వారు మాత్రం వాటిని పట్టించుకోకుండా తమ పనులలో ముందుకు వెళ్తున్నారు.ఇక పూరి జగన్నాథ్ సినిమాల విషయానికి వస్తే లైగర్ సినిమా( Liger Movie ) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరి జగన్నాథ్ కు భారీ డిజాస్టర్లు ఎదురయ్యాయి.
దీంతో ఈయన తన తదుపరి చిత్రాన్ని హీరో రామ్ పోతినేనితో చేస్తున్నారు.వీరిద్దరి కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా( Double Ismart Shankar ) షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు.