రాజన్న సిరిసిల్ల జిల్లా: బుధవారం సిరిసిల్ల పట్టణంలోని ఎల్లమ్మ జంక్షన్ లో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవం కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,
రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ లు జిందం కళా చక్రపాణి, జిల్లా అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మంచె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.కూడలి లో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ నిలువెత్తు కాంస్య విగ్రహానికి వారు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘట్టించారు.
స్వాతంత్రోద్యమ సాధనలో,తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ చేసిన కృషి,నిస్వార్థ సేవలను వారు స్మరించుకున్నారు.