ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోతున్నారు.ఈ క్రమంలో పోలీసులే టార్గెట్ గా మందుపాతరను ఏర్పాటు చేశారు.
కాంకేర్ జిల్లా గుండిహిడి బడగాం హైవేపై పెట్టిన మందుపాతరను గుర్తించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహారించి దాన్ని నిర్వీర్యం చేశారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.
అనంతరం చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు మర్రిమల్ల అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది.







