జమిలి ఎన్నికల అంశంపై లా కమిషన్ మరి కాసేపటిలో కీలక సమావేశం నిర్వహించనుంది.ఈ మేరకు ఉదయం 11 గంటలకు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో భేటీ కానుంది.
ఇందులో భాగంగా వన్ నేషన్ – వన్ ఎలక్షన్స్ పై తమ వైఖరిని లా కమిషన్ ఖరారు చేయనుందని తెలుస్తోంది.ఈ క్రమంలో జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలపై లా కమిషన్ చర్చించనుంది.
అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, 85, 172, 174 మరియు 356 లో సవరణలపై కమిషన్ కసరత్తు చేయనుంది.