రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో దివ్యాంగులకు బస్ పాస్ ల జారీ మేళా నిర్వహించనున్నట్లు సిరిసిల్ల డిపో మేనేజర్ ఎన్.మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమం సిరిసిల్ల కొత్త బస్టాండ్ లోని బస్ పాస్ కౌంటర్ లో శనివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని తెలిపారు.సదరం సర్టిఫికెట్ లో లోకో మోటర్/ఆర్ధో 40 శాతం మించి ఉండాలని, వినికిడి, దృష్టిలోపం ఉన్నవారికి 100% ఉండాలని,
మెంటల్ రిటార్టేషన్ ఉన్న వారి ఐక్యూ 69 శాతం కంటే తక్కువ ఉండాలని తెలిపారు.
దివ్యాంగులు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సదరం సర్టిఫికెట్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఐడి కార్డ్ సర్వీస్ ఛార్జ్ కొరకు రూపాయలు:50/- యాభై రూపాయలు తీసుకొని సిరిసిల్ల కొత్త బస్టాండ్ లో నిర్వహించు దివ్యాంగుల బస్ పాస్ స్పెషల్ క్యాంప్ మేళా నందు పి హెచ్ సి బస్ పాస్ లను పొందాలని పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.