ఈ భూ ప్రపంచంపై ఎన్నో భయానక జీవులు పుట్టాయి, వాటిలో చాలా జీవులు అంతరించిపోయాయి.ఉదాహరణకు డైనోసార్లు.
ఒకప్పుడు అవి ఉనికిలో ఉండేవి, భారీ ఎత్తులో ఉండే ఇవి చాలా ప్రమాదకరమైనవి కూడా.అయితే డైనోసార్‌ల మాదిరిగానే ఒకే జాతికి చెందిన అనేక జీవులు ఇప్పటికీ ఉన్నాయి, అవి వాటిలాగే భయంకరంగా కనిపిస్తాయి.
అటువంటి జీవుల్లో కొమోడో డ్రాగన్ ఒకటి.ఈ రాకాసి బల్లి క్రూరమైన మాంసాహారి.
ఇది తన ఎరలను వేటాడి వెంటాడి చంపుతుంది.క్షణాల వ్యవధిలోనే పెద్ద ఎరలను కూడా నమిలి మింగేస్తుంది.

ఇటీవల, కొమోడో డ్రాగన్( Komado Dragon ) ఎంత ప్రమాదకరమైనదో చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అందులో అది ఏకంగా ఓ మేకను ఒకేసారి మింగినట్లు కనిపించింది.ట్విట్టర్ అకౌంట్ @Rainmaker1973లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో మేక చనిపోయి నేలమీద పడి ఉండటం గమనించవచ్చు.కొమోడో డ్రాగన్ ఈ మేక వైపుగా కొంత దూరం నుంచి నడుస్తూ రావడం కూడా చూడవచ్చు.
దగ్గరకు రాగానే మేకను నోటితో పట్టుకుని ఒక్కసారిగా అది మింగేసింది.అంత పెద్ద మేకను కొమోడో డ్రాగన్ కేవలం క్షణాల్లోనే గుటుక్కున మింగటం చూసి ఇది నిజంగా షాకింగ్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోకు 1 కోటి కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి, చాలా మంది “వాటిని చూస్తుంటే మనుషుల్ని కూడా తినేస్తాయేమో అనిపిస్తోందని” అన్నారు.ఈ జీవిని చూస్తే డైనోసార్లు( Dinosaurs ) నిజంగానే ఉన్నాయనే విషయం స్పష్టమవుతోందని మరొకరు కామెంట్ చేశారు.ఆ మేక ఎముకలను కొమోడో డ్రాగన్ ఎలా జీర్ణించుకుంటుందని మరికొందరు సందేహాలను వ్యక్తపరిచారు.ఇకపోతే కొమోడో డ్రాగన్ జీవులు కూడా అత్యంత విషపూరితమైనవి.ఇండోనేషియాలోని కొమోడో ద్వీపంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.







