Pawan Kalyan Mahesh Babu : ఏ హీరోకు ఎలాంటి కబుర్లు చెప్తే డైరెక్టర్ కి డేట్స్ ఇస్తారో తెలుసా ?

ఏ దర్శకుడైన ఒక సినిమా తీయాలంటే బోలెడంత టాలెంట్ ఉండాలి.అది కేవలం సినిమా తీసే విషయంలోనే కాదు సినిమాకు హీరోని నటించెలా ఒప్పించడం కూడా చాలా పెద్ద టాలెంట్ కలిగి ఉంటేనే తప్ప సాధ్యం కానీ రోజులు ఇవి.

 Tollywood Heros Intresting Facts-TeluguStop.com

కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా పూరి జగన్నాధ్ ఏ హీరోకి ఏం స్టోరీ చెబితే సినిమా తీయడానికి ఒప్పుకుంటారు చాలా క్లియర్ గా ఒక పబ్లిక్ ఈవెంట్ లో తెలిపారు.అది కూడా మహేష్ బాబు ఎదురుగా కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ చెప్పడం విశేషం.

మరి టాలీవుడ్ టాప్ స్టార్స్ కి ఏ కథలు చెప్పాలి.? అవి ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మహేష్ బాబు

Telugu Jr Ntr, Mahesh Babu, Pawan Kalyan, Ravi Teja, Tollywood, Tollywood Heros-

మహేష్ బాబుని( Mahesh babu ) ఏ సినిమా కోసం డేట్ అడగాలంటే సినిమా షూటింగ్ రేపు స్టార్ట్ అవుతుంది బాబు కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు చెప్తే చాలు ఆయన డేట్స్ ఇచ్చేస్తారట.

పవన్ కళ్యాణ్

Telugu Jr Ntr, Mahesh Babu, Pawan Kalyan, Ravi Teja, Tollywood, Tollywood Heros-

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ని డేట్లు అడగాలంటే సినిమాలో గన్స్ ఉంటే చాలు.సినిమా మొత్తం గన్ ఫైటింగ్స్ ఉంటాయి అలాగే విలన్ పెద్ద గన్ డీలర్.ఇష్టమొచ్చినట్టు కాల్ చేసుకోవచ్చు అని చెబితే చాలు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇట్టే లభిస్తాయి.

ప్రభాస్

సినిమాలో ఎలాంటి అవుట్ డోర్ షూటింగ్ లేదు మొత్తం ఇండోర్ సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నాం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెబితే చాలు ప్రభాస్( Prabhas ) డేట్స్ అలవోకగా దొరికిపోతాయట.

జూనియర్ ఎన్టీఆర్

Telugu Jr Ntr, Mahesh Babu, Pawan Kalyan, Ravi Teja, Tollywood, Tollywood Heros-

ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డు కొట్టబోతున్నాము బ్లాక్ బాస్టర్ హిట్టు గ్యారంటీ కుమ్మేయాల్సిందే అని చెబితే చాలు తారక్ పూనకంతో ఊగిపోయి డేట్స్ ఇచేస్తారట.

రవి తేజ

రవితేజ( Ravi Teja ) విషయాన్ని కొస్తే ఈరోజు షూటింగ్ మొదలైపోతుంది భయ్యా కేవలం 30 రోజుల్లో పూర్తి చేసేస్తాను అంటే చాలు ఎలాంటి ఈ సెకండ్ థాట్ లేకుండా ఆయన డేట్స్ దొరికిపోతాయట.ఇలా హీరోలను నాడి పట్టుకుని సినిమా కథలను వినిపించడం వల్ల ఏ హీరో డేట్స్ ఎలా దొరుకుతాయో ఈజీగా తెలిసిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube