నల్లగొండ జిల్లా: వేములపల్లి మండల ఎంపీపీ పుట్టల సునీత( MPP Puttala Sunitha ( మంగళవారం జరిగే మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందడం లేదన్నారు.
మండలంల దళిత బంధు,బీసీ బంధు, గృహలక్ష్మి వంటి పథకాలను ఎంపీపీకి, ఎంపిటిసిలకు,సర్పంచ్ లకు తెలియకుండా ఫైనల్ లిస్టు తయారు చేయడం ఏంటని,ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రజా ప్రతినిధులుగా తామేమీ చేయాలని ప్రశ్నించారు.
సంక్షేమ పథకాలు( welfare schemes ) అర్హులైన వాళ్లకు అందకుండా బీఆర్ఎస్ పార్టీ ( BRS party )నాయకులు వాళ్లకు వారే ఇచ్చుకుంటున్నారనిఆరోపించారు.
అందుకే మండల సర్వసభ్య సమావేశం బైకాట్ చేయాల్సి వచ్చిందన్నారు.