ప్రముఖంగా ఉపయోగించే మసాలా దినుసులలో మిరియాలు కూడా ఒకటి.మిరియాలు తీగ జాతికి చెందినది.
ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర( Coastal Andhra ) ప్రాంతంలో మిరియాల సాగు( Pepper cultivation ) అధిక విస్తీర్ణంలో సాగు అవుతుంది.మిరియాలను వివిధ పంటలలో అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు.
మిరియాలను వర్షాధార పంటగా సాగు చేసి మంచి దిగుబడి పొందవచ్చు.మిరియాల సాగులో అధిక దిగుబడి కోసం మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకొని సాగు చేయాలి.
అధిక దిగుబడి ఇచ్చే మేలు రకం విత్తనాలు ఏమిటో చూద్దాం.
పన్నియర్-1:
ఈ రకం విత్తనాలను( Panniyur 1 ) సాగు చేస్తే.ఈ రకం మొక్కల ఆకులు వెడల్పుగా ఉండి కాయల గుత్తులు పొడవుగా ఉంటాయి.కాకపోతే ఈ రకం విత్తనాలకు చెందిన మొక్కలు నీడను తట్టుకోలేవు.
నీడలో ఉంటే కుళ్ళు తెగుళ్లు సోకే అవకాశం ఉంది.ఒక ఎకరం పొలంలో సాగు చేస్తే దాదాపుగా 500 కిలోల ఎండు మిరియాల దిగుబడి పొందవచ్చు.
పన్నియర్-2:
ఈ రకానికి చెందిన మొక్కల ఆకులు స్థ పొడవుగా ఉండి కాయల గుత్తులు సుమారుగా 10 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.ఈ రకం విత్తనాలను సాగు చేస్తే ఒక ఎకరంలో దాదాపుగా 800 కిలోలకు పైగా దిగుబడి పొందవచ్చు.
మిరియాల మొక్క కొమ్మలను రెండు లేదా మూడు కణపులున్న చిన్నచిన్న కొమ్మలుగా కత్తిరించి నాటుకోవచ్చు.ఈ కొమ్మలను మార్చి లేదా ఏప్రిల్ నెలలో తీసుకొని నారుమడిలో నాటుకోవాలి.
జులై నెలలో ప్రధాన పొలంలో నాటుకోవాలి.మిరియాల మొక్కలు నాటడానికి ముందే పొలంలో సిల్వర్క్ మొక్కలను 2.5-2.5 మీటర్ల ఎడంలో నాటాలి.ఈ సిల్వర్క్ మొదల వద్ద 50-50-50 పరిమాణం ఉన్న గుంతలు తవ్వి మిరియాల తీగలను నాటుకోవాలి.ప్రతి తీగ వద్ద 10 కిలోల పశువుల ఎరువు, 50 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 120 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి.
ఎరువులను రెండు సమభాగాలుగా విభజించుకుని మే నెలలో సగభాగం, ఆగస్టు నెలలో మరో సగభాగం పంటకు అందించాలి.ఫిబ్రవరి నెలలో కొమ్మ కత్తిరింపులు జరిపితే మొక్క గుబురుగా పెరిగి దిగుబడి పెరుగుతుంది.