భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును టీడీపీ నేత నారా లోకేశ్ కలిశారు.సమావేశంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని లోకేశ్ రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సీఎం జగన్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని, ప్రతిపక్షాలపై అణచివేత చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుందని లోకేశ్ రాష్ట్రపతికి వివరించారు.అక్రమ కేసులో కక్ష పూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని పేర్కొన్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని లోకేశ్ రాష్ట్రపతిని కోరారు.కాగా ఈ భేటీలో నారా లోకేశ్ తో పాటు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల ఉన్నారు.