స్నేహ నంబియార్ ( Sneha Nambiar ) దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలో ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె దివంగత నటుడు శరత్ బాబు( Sarath Babu ) కి భార్య అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక వీరిద్దరు భార్యాభర్తలు అంటూ వీరి ఫోటోలను సోషల్ మీడియాలో కూడా భారీగా వైరల్ చేశారు.
అలాగే శరత్ బాబు చనిపోయిన సమయంలో తన రెండవ భార్య స్నేహ నంబియార్ అంటూ ఈమె ఫోటోలను కూడా షేర్ చేశారు.అయితే తాజాగా ఈ ఫోటోల పట్ల శరత్ బాబు రెండో భార్య అంటూ ఆమె గురించి వస్తున్నటువంటి వార్తల పట్ల నటి స్నేహ నంబియార్ స్పందించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నేను శరత్ బాబు భార్యను కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారో అసలు శరత్ బాబుకు నాకు పెళ్లి కూడా జరగలేదని తెలిపారు.అయితే శరత్ బాబు రెండవ భార్య( Second Wife ).పేరు కూడా స్నేహ నంబియార్ కావడంతో నేనేనని చాలామంది శరత్ బాబుతో కలిసి నా ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారని ఇలా ఆయన పక్కన ఆయన రెండో భార్యగా నా ఫోటో కనిపించడంతో చాలా ఇబ్బంది పడ్డానని ఈమె తెలియజేశారు.

శరత్ బాబు రెండవ భార్య ప్రముఖ నటుడు నంబియార్ కుమార్తె స్నేహ నంబియార్( Sneha Nambiar ).అయితే నా పేరు కేవలం స్నేహ మాత్రమేనని కానీ మా వర్గానికి చెందినవారు తమ పేర్లు పక్కన నంబియార్ అని చేర్చుకుంటారని అందుకే తన పేరును స్నేహ నంబియార్ గా పెట్టుకోవడం వల్ల చాలామంది నేను శరత్ బాబు భార్యను అంటూ నా గురించి వార్తలు రాస్తున్నారు అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక శరత్ బాబు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగారు.
ఈయన ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చే చివరి రోజులలో ఒంటరిగా గడిపి చివరికి అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి మనకు తెలిసిందే.







