లవంగాలు( Cloves ). వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
మన ఇండియన్ స్పైసెస్ లో లవంగాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది.ఘాటైన రుచి, వాసన కలిగి ఉంటే లవంగాలను నాన్ వెజ్ వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు.
అలాగే బిర్యానీ, పులావ్ వంటి స్పెషల్ డిషెస్ చేస్తే కచ్చితంగా లవంగాలు పడాల్సిందే.లవంగాల్లో అనేక పోషకాలతో పాటు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
ఆరోగ్యపరంగా లవంగాలు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అలాగే జుట్టు సంరక్షణకు( Healthy Hair ) కూడా లవంగాలు ఉపయోగపడతాయి.ముఖ్యంగా బలహీనమైన జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి లవంగాలు ఎంతో చక్కగా తోడ్పడతాయి.మరి ఇంతకీ లవంగాలను ఎలా వాడాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ స్పూన్ లవంగాలు వేసుకోవాలి.
అలాగే రెండు మందారం పువ్వులు, రెండు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) వేసి మరిగించాలి.
ఆల్మోస్ట్ వాటర్ సగం అయ్యేంతవరకు హీట్ చేయాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.
కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేయాలి.తద్వారా మంచి టోనర్ సిద్ధమవుతుంది.
ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే మీ జుట్టు కుదుళ్ళు ఎంత బలహీనంగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే స్ట్రాంగ్ అవుతాయి.
హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.చుండ్రు సమస్య ఉన్నా కూడా దూరం అవుతుంది.