విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరో గా సమంత( Samantha ) హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఖుషి సినిమా( Kushi Movie ) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.సినిమా కు వచ్చిన టాక్ నేపథ్యం లో కచ్చితంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేస్తుందని అంత భావించారు.కానీ ఇతర సినిమాల పోటీ ఏమీ లేకున్నా కూడా ఖుషి సినిమా వసుళ్ల పరంగా తీవ్ర నిరాశ పరిచింది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
ఆశించిన కలెక్షన్స్ లో కనీసం 60 శాతం కూడా రాబట్ట లేక పోయింది అంటూ చాలా మంది బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ఈ మధ్య కాలం లో పాజిటివ్ టాక్ వచ్చి ఇంత తక్కువ కలెక్షన్స్ ని( Kushi Collections ) రాబట్టిన సినిమాల్లో ఇదే ముందు వరుసలో నిలుస్తుంది అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సమంత మరియు విజయ్ దేవరకొండ సినిమా అనగానే చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ బాట పట్టారు.అయితే యూత్ ఆడియన్స్ లో కనెక్ట్ అయ్యే లవ్ ఎలిమెంట్స్ ఈ సినిమా లో ఎక్కువగా లేవు.
అందుకే ఈ సినిమా ను యూత్ ఆడియన్స్ దూరం పెట్టారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయినా కూడా యూత్ ఆడియన్స్ కి చేరువ కాలేక పోవడం తో విజయ్ దేవరకొండ సమంత మూవీ ఖుషి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించలేక పోయింది అంటూ విశ్లేషకుల అభిప్రాయం.అయితే నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్( Mytri Movie Makers ) మాత్రం ఈ సినిమా తో లాభాలు దక్కించుకున్నారు అనేది టాక్.కొన్ని ఏరియాల్లో అంటే వైజాగ్ వంటి ఏరియా లో సినిమా బయ్యర్లు భారీ మొత్తానికి కొనుగోలు చేయడం ద్వారా నష్టపోవాల్సి వచ్చిందని సమాచారం.







