బార్ల టెండర్లు కాదు రోడ్ల టెండర్లు వేయండి

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో వేయాల్సింది బార్ల టెండర్లు కాదని,రోడ్ల నిర్మాణ టెండర్లు వేయాలని నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వేపూరి సుధీర్( Vepuri Sudhir ) డిమాండ్ చేశారు.సోమవారం సూర్యాపేట జిల్లా( Suryapet ) నడిగూడెం మండల పరిధిలోని వేణుగోపాలపురం- రామచంద్రాపురం ఎక్స్ రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వాన్నంగా తయారవడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు,విద్యార్థులతో కలిసి రోడ్డుపై మురికి గుంతలో కూర్చొని నిరసన తెలిపారు.

 Tender For Roads Not Tenders For Bars-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా ఈ రోడ్డుపై ప్రమాదకర గుంతలు ఏర్పడి నిత్యం
ప్రమాదాలుజరుగుతున్నా,వర్షపునీరు గుంతల్లో నిలిచి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు.

నిత్యం వందలాదిమంది విద్యార్థులు, రైతులు( Students ) ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే నడిగూడెం మండల కేంద్రం గ్రామపంచాయతీ వద్ద ప్రధాన రోడ్డు మరియు గోపాలపురం రోడ్డు కొత్తగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యను సత్వరమే పరిష్కరించకుంటే అధికారులను,ప్రజాప్రతినిధులను గ్రామాలలో తిరగనివ్వమని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube