ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలి.లేని పక్షంలో పోలీసులు ఆపి ఫైన్ విధిస్తారు.
అలాంటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ని( Traffic Rules ) తెలుసుకొని మళ్లీ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రతి వాహనదారుడుది.అయితే కొందరు మాత్రం ఈ విషయం అర్థం చేసుకోకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ చివరికి చిక్కుల్లో పడుతున్నారు.
తాజాగా ఒక లేడీ బైకర్( Lady Biker ) కూడా నానా రచ్చ సృష్టించింది.చివరికి తాను చేసిన తప్పులకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ నుపుర్ పటేల్( Nupur Patel ) 2023, సెప్టెంబర్ 15న ముంబై ట్రాఫిక్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగింది.ఆమె బాంద్రా-వర్లీ సీ లింక్‌పై( Bandra-Worli Sea Link ) మోటార్‌సైకిల్ నడుపుతూ పోలీసులకు కనిపించింది.
ఇది టూ-వీలర్స్‌ను అనుమతించని వంతెన.ఆమె హెల్మెట్ ధరించకుండా వేగంగా కూడా వెళ్లింది.
ట్రాఫిక్ పోలీసులు ఆమెను ఆపి లైసెన్స్, బైక్ పేపర్లు చూపించాలని కోరారు.అయితే ఆమె వారి మాట వినకపోగా వారితో గొడవకు దిగింది.
తాను పన్నులు కడుతున్నానని, ఈ రోడ్డు తన తండ్రిది అని, ఆ వంతెనపై ప్రయాణించే హక్కు తనకు ఉందని చెప్పింది.ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi ) చెబితేనే బైక్ ఆఫ్ చేస్తానని కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది.
పోలీసుల పట్ల ఆమె చాలా అసభ్యంగా ప్రవర్తించింది.తన బైక్‌ను తాకితే చేతులు నరికేస్తానని బెదిరించింది.ఆమె ఒక కానిస్టేబుల్‌ని కూడా తోసేసింది.తుపాకీ లాంటిది తీసి వారి వైపు చూపింది.కానీ అది పిస్టల్ ఆకారంలో ఉన్న లైటర్ అని తేలింది.పోలీసులు ఆమె వద్ద ఉన్న లైటర్‌ను తీసుకెళ్లి బైక్‌ను ( Bike ) స్వాధీనం చేసుకున్నారు.
ఆమె ప్రవర్తనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు.ఈ వీడియో వైరల్‌గా మారగా, ఆమె చర్యలపై పలువురు విమర్శలు గుప్పించారు.
దాడి చేయడం, అడ్డుకోవడం, ప్రమాదానికి గురి చేయడం, ర్యాష్‌గా డ్రైవింగ్ చేయడం వంటి పలు నేరాలకు సంబంధించి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.హెల్మెట్ ధరించనందుకు ఆమెకు జరిమానా కూడా విధించారు.విచారణ అధికారి ముందు హాజరుకావాలని, వారు ఆమెకు నోటీసు ఇచ్చారు.అనంతరం వదిలిపెట్టారు.