దేశీయ టెక్నాలజీ కంపెనీ టెక్నో( Tecno ) భారతదేశంలో అత్యంత సరసమైన ఫ్లిప్ ఫోన్ అయిన ఫాంటమ్ V ఫ్లిప్ 5G ( Phantom V Flip 5G )ని తాజాగా విడుదల చేసింది.8GB + 256GB వేరియంట్ కోసం దీని ధరను రూ.49,999గా నిర్ణయించింది.మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫ్లిప్ ఫోన్స్ తో పోలిస్తే ఇది చాలా చవక అని చెప్పవచ్చు.
ఇది ఇంట్రడక్టరీ ప్రైస్ అని గమనించాలి, భవిష్యత్తులో ఇది పెరగవచ్చు.అక్టోబర్ 1న ఈ ఫోన్ సేల్ కు అందుబాటులోకి రానుంది.

ఫాంటమ్ V ఫ్లిప్ 5G మొబైల్ ఫీచర్ల గురించి తెలుసుకుంటే ఇందులో ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్‌ను అందించారు.ఈ AMOLED ప్యానెల్ ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌తో 1.32-అంగుళాల ఔటర్ స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది.8GB RAM + 256GB స్టోరేజ్‌తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్‌సెట్‌తో ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది.200,000 ఫ్లిప్‌ల తర్వాత కూడా ఫ్లిప్ మెకానిజం స్క్రీన్‌ను క్రీజ్‌లెస్‌గా ఉంచుతుందని టెక్నో చెప్పింది.

ఫాంటమ్ V Flip 5G మొబైల్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత UIతో వస్తుంది.2 OS అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్( Fast Charging )తో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది.వెనుకవైపు, ఫోన్‌లో 64MP ప్రైమరీ కెమెరా, 13MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.
ముందు భాగంలో, ఇది సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.ఫోన్ కనెక్టివిటీ కోసం 5G, Wi-Fi 6, NFC మరియు బ్లూటూత్‌లకు మద్దతు ఇస్తుంది.







