కమల్ హాసన్ యాక్టింగ్ కు ఫిదా కాని అభిమానులు ఉండరు.ఎలాంటి రోల్ లో నటించినా కమల్ హాసన్( Kamal Haasan ) పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనే సంగతి తెలిసిందే.
కమల్ హాసన్ విక్రమ్ సినిమా( Vikram movie )తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోగా కమల్ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.అయితే కమల్ హాసన్ కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.
ఒకానొక సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని కమల్ తెలిపారు.నాకు 21 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని కమల్ హాసన్ తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో నాకు మంచి ఆఫర్లు రావడం లేదని తగినంత గుర్తింపు లభించలేదని ఫీలయ్యానని ఆయన కామెంట్లు చేశారు.నేను ఆత్మహత్య చేసుకుంటే ప్రతిభ ఉన్న కళాకారుడిని కోల్పోయామని సినిమా ఇండస్ట్రీ ఫీలవుతుందని భావించానని ఆయన తెలిపారు.
నా గురువు అనంత్ కు కూడా అదే విషయం చెప్పానని కమల్ హాసన్ ( Kamal Haasan )వెల్లడించారు.ఆ సమయంలో గురువుగారు నీ పని నువ్వు చేసుకుంటూ పో సరైన సమయంలో గుర్తింపు వస్తుందని చెప్పారని కమల్ హాసన్ పేర్కొన్నారు.
నాకు కూడా ఆత్మహత్య సబబు కాదని అనిపించిందని ఆయన కామెంట్లు చేశారు.హత్య ఎంత నేరమో ఆత్మహత్య కూడా అంతే నేరం పాపం అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
చీకటి అనేది లైఫ్ లో శాశ్వతంగా ఉండకూడదని కమల్ హాసన్( Kamal Haasan ) అభిప్రాయం వ్యక్తం చేశారు.లైఫ్ లోకి కచ్చితంగా వెలుగు వస్తుందని ఆయన అన్నారు.మనల్ని నిద్రపోనివ్వకుండా చేసేది అసలైన కల అని కమల్ హాసన్ కామెంట్లు చేశారు.చావు అనేది కూడా జీవితంలో భాగమేనని కమల్ హాసన్ వెల్లడించారు.కమల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా( Social media ) వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.