మధ్యప్రదేశ్( Madhya Pradesh ) రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.బైక్ పై వెళ్తున్న ఒక యువకుడిని విషపూరిత నాగుపాము కాటేసింది.
క్షణాల్లోనే అతనికి విషం ఎక్కింది.దాంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అనంతరం ప్రాణాలు విడిచాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే, మనీష్ అనే వ్యక్తి పాములు పడుతుంటాడు.ఇటీవల ఒక నాగుపాము( Cobra )ని పట్టుకొని ఒక బైక్ వెనుక కూర్చొని వెళ్తున్నాడు.ఆ సమయంలో మనీష్ రెండు చేతులతో నాగుపామును పట్టుకున్నాడు.
అయితే మార్గం మధ్యలో పాము అతడి చేతిలో నుంచి జారింది.ఆ విషయం గ్రహించే లోపే ఆ నాగుపాము అతన్ని కాటేసింది.
మనీష్ స్నేహితుడు బైక్ నడుపుతుండగా పిలియన్ సీటుపై మృతుడు కూర్చున్నాడు.
వైరల్ వీడియోలో, నాగుపాము మనీష్‌ను కాటేయడంతో అతని స్నేహితుడు మోటర్‌బైక్‌ను ఆపడం చూడవచ్చు.అతడు పాము( Snake )కి దూరంగా వెళ్లిపోయాడు.కొద్ది దూరంలో నుంచి మనీష్‌కు ఏం జరుగుతుందోనని అలానే చూస్తుండి పోయాడు.
పాము కాటేసిన తర్వాత మనీష్ నిల్చోడానికి ప్రయత్నించాడు.విషం వేగంగా తన శరీరంలోకి ప్రవేశించడంతో క్షణాల్లోనే కింద పడిపోయి చనిపోయాడు.
ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది.ఈ వీడియో చూసి చాలామంది షాక్ అవుతున్నారు.
పాములను పట్టుకునేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ చిన్న తప్పు జరిగినా వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.ఇప్పటికే ఈ ప్రొఫెషన్‌లో ఉన్న చాలామంది మృత్యువాత పడ్డారు.
అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.