కన్ఫ్యూజ్ చేస్తున్న కాపు నేతలు!

రాష్ట్రంలో సంఖ్యాపరంగా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ రాజ్యాధికారం సాధించలేకపోవడం ఆ వర్గానికి చాలా కాలం నుండి ఉంటుంది.ఇంతకాలానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రూపంలో ఆ సామాజిక వర్గ నేత ముఖ్యమంత్రి అవుతాడని మెజారిటీ కాపువర్గ నేతలు , యువత ఆ పార్టీకి బలంగానే వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు.

 Confusing Kapu Leaders, Pawan Kalyan , Mudragada Padmanabham , Vangaveeti Radha-TeluguStop.com

ప్రజారాజ్యం అనుభవాలతో 2019ఎన్నికలలో జనసేనకు దూరంగా ఉన్నప్పటికీ తాను దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగటానికే వచ్చానని ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుంటాను తప్ప వెనకడుగు వెయ్యనని 2019 ఎన్నికలలో దారుణ పరాజయం ఎదురైనా గట్టిగా నిలబడి పవన్ నిరూపించుకున్నందున ఈసారి ఎన్నికలలో తమ పూర్తి మద్దతు పవన్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ఆ పార్టీ కార్యక్రమంలో ఆ సామాజిక వర్గ యువత ఇన్వాల్వ్ అవుతున్న విధానం బట్టి అర్థమవుతుంది.

Telugu Ap, Jana Sena, Pawan Kalyan, Vangaveetiradha-Telugu Top Posts

అయితే ముద్రగడ( Mudragada Padmanabham ) విషయంలో తెలుగుదేశం పట్ల కాపు యువతలో కొంత అసంతృప్తి ఉన్నమాట కూడా నిజమే, సరిగ్గా దీనిని ఉపయోగించుకోవాలని చూస్తున్న అధికార వైసిపి ఇప్పుడు తెలుగుదేశంతో జనసేన పొత్తును కాపు నేతలకు ఇష్టం లేనట్లుగా కొంతమంది తమ అనుకూల వ్యక్తులతో మీటింగ్లు పెట్టి చిత్రీకరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి .పవన్ ఒంటరిగా వెళ్తేనే మద్దతు ఇస్తాము తప్ప రంగాకు, ముద్రగడకు ద్రోహం చేసిన తెలుగుదేశంతో కలిసి నడిస్తే ఊరుకోమంటూ వారు హెచ్చరికలుజారీ చేస్తున్నారు .

Telugu Ap, Jana Sena, Pawan Kalyan, Vangaveetiradha-Telugu Top Posts

మరోపక్క జనసేన పార్టీకి( Jana sena ) అనుకూలంగా కూడా మరో కొంతమంది సామాజిక వర్గ పెద్దలు, సంస్థలు మద్దతు ప్రకటనలుకూడా వస్తున్నాయి దాంతో అసలు కాపు నేతల మెజారిటీ మద్దతు ఎటువైపు ఉందో అన్న అనుమానాలు వినిపిస్తున్నప్పటికీ కేవలం వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు మాత్రమే ఇటువంటి ప్రకటనలు ఇస్తున్నారని దాదాపు 90 శాతానికి పైగా ఈ సామాజిక వర్గం మద్దతు జనసేనకు ఉందని జనసెన నేతలు చెప్తున్నారు.ఏది ఏమైనప్పటికీ తన సామాజిక వర్గంలో పవన్ బలం నిరూపించుకుంటాడో లేదో 2024 ఎన్నికల పలితాలు బట్టి తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube