'సలార్' డిమాండ్ మొత్తం పడిపోయిందిగా..ఆ ప్రాంతం లో బయ్యర్స్ లేరా?

ఇండియా మొత్తం ఎదురు చూస్తున భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీస్ లో ఒకటి ‘సలార్‘( Salaar ).ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel )తో సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు కచ్చితంగా తారాస్థాయిలోనే ఉంటాయి.

 As The Total Demand Of 'salar' Has Fallen...are There No Buyers In That Area ,-TeluguStop.com

దానికి తగ్గట్టుగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూడడం మొదలు పెట్టారు.ఫలితంగా ఈ సినిమాకి క్రేజీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మరియు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ సినిమాని 10 మిలియన్ డాలర్స్ కి థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసారంటే సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఊహించొచ్చు.అన్నీ అనుకున్నట్టు జరిగింది ఉంటే, ఈ పాటికి ఈ సినిమా ఈ నెల 28 వ తారీఖున అనీ ప్రాంతీయ భాషల్లో విడుదల అయ్యుండేది.

Telugu Salaar, Bollywood, Makers, Prabhas, Prashanth Neel, Shruti Haasan, Tollyw

కానీ సినిమా లో కొన్ని సన్నివేశాల ఔట్పుట్ సరిగా రాలేదని, వాటిని మళ్ళీ రీ షూట్ చెయ్యాలనే ప్లాన్ తోనే సినిమా వాయిదా వేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ప్రభాస్ ( Prabhas )కి మోకాళ్ళ సర్జరీ చేసుకున్న కారణంగా కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.ఆయన పూర్తిగా కోలుకోగానే ఈ రీ షూట్స్ పూర్తి చేసి సినిమాని విడుదల చేస్తున్నారు.అయితే ఈ చిత్రానికి ముందు అనుకున్న డబ్బులు ఇవ్వబోమని , కాస్త బాగా తగ్గించి ఇవ్వాలని బయ్యర్స్ నుండి ఒత్తిడి ఎదురు అవుతుంది.

మేకర్స్ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా బయ్యర్స్ ఒప్పుకోవడం లేదు.ముఖ్యంగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చెయ్యాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బయ్యర్స్ నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారు.

ఎందుకంటే ఆ సీజన్ లో టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తాయి కాబట్టి.

Telugu Salaar, Bollywood, Makers, Prabhas, Prashanth Neel, Shruti Haasan, Tollyw

కానీ ఓవర్సీస్ బయ్యర్స్ అందుకు ఒప్పుకోవడం లేదు. బాలీవుడ్( Bollywood ) క్రేజీ మూవీస్ తో పాటుగా హాలీవుడ్ మూవీస్ కూడా ఉంటాయి.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి కావాల్సినంత థియేటర్స్ మాత్రం రావు.

అలా పెద్ద సమస్యల్లో చిక్కుకున్న నిర్మాతలు మార్చి 22 వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.ముందుగా ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ హక్కులు 160 కోట్ల రూపాయలకి పలికింది.

బయ్యర్స్ అంత ఇవ్వడానికి కూడా సుముఖత చూపించలేదు కానీ, మార్చి 22 వ తారీఖున వస్తే మాత్రం 120 కోట్ల రూపాయిలు మాత్రమే ఇస్తామని అంటున్నారట.మరి మేకర్స్ దీనికి ఒప్పుకుంటారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube