సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి కీర్తి సురేష్ ఒకరు.ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక నటిగా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టబోతుంది అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలు ఎక్కడ స్పందించలేదు.సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సెలబ్రిటీలు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నటి కీర్తి సురేష్( Keerthy Suresh ) సైతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోబోతున్నారని సమాచారం.ఇప్పటికే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అవకాశాలు వస్తున్నాయని అయితే ఈమె ఒక సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తుంది అయితే ఈ సినిమా గురించి ఎక్కడ అధికారక ప్రకటన లేకపోయినప్పటికీ తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించిన ఒక వీడియో చూస్తే మాత్రం ఈమె బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అనే విషయం గురించి పూర్తి స్పష్టత వస్తుంది.
తాజాగా కీర్తి సురేష్ ఆటో( Auto ) ఎక్కి ముంబై వీధులలో ఎంచక్కా చెక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేశారు.అయితే ఈ ఆటోలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ( Varun Dhawan ) కూడా ఉండటం గమనార్హం.ఈ విధంగా వరుణ్ ధావన్ తో కలిసి కీర్తి సురేష్ ఆటోలో ప్రయాణిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి వార్తలు వైరల్ అయ్యాయి.
ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్నారని వరుణ్ ధావన్ తో కలిసి ఈమె బాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.