టాప్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కృష్ణవంశీ ( Krishna Vamshi ) గారు తన గ్రాడ్యుయేషన్ పూర్తయి 1980s టైంలో సినిమాల్లోకి రావాలని ఎంతగానో ఆసక్తి చూపించారట.ఇక సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెమెరా మ్యాన్ గా ఇలా అందివచ్చిన అవకాశాలన్నీ యూస్ చేసుకొని చివరికి స్టార్ డైరెక్టర్ అయ్యారు.

అయితే ఆ సమయంలో ఎవరికి వాళ్లు కృష్ణ వంశీ తో దొరికిందే చాన్స్ అనుకోని వారి పని మొత్తం పూర్తి చేసుకుని ఒక్క రూపాయి కూడా ఆయనకు జీతం ఇచ్చేవారు కాదట.ఇక ఆ సమయంలో కృష్ణవంశీ చాలా బాధపడిపోయేవాడట.కానీ ఎంతో పెద్ద పెద్ద నిర్మాత లు,దర్శకులు ఈయనకు డబ్బుల విషయంలో హ్యాండ్ ఇచ్చినప్పటికీ కేవలం శృంగార తార సిల్క్ స్మిత ( Silk Smitha ) మాత్రం అప్పట్లోనే ఈయనకు పెద్ద సహాయం చేసిందట.
ఇక ఆ సహాయాన్ని కృష్ణవంశీ ( Krishna Vamshi ) ఇప్పటికీ మర్చిపోలేదట.ఇక అసలు విషయం ఏమిటంటే.1987లో సిల్క్ స్మిత నిర్మాత గా ఒక సినిమా వచ్చింది.ఇక ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కృష్ణవంశీ మొదటిసారి చేశారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత కృష్ణ వంశీ కి 500 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చిందట.
ఇక ఆయన అన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో కొనసాగినా కూడా ఎవరూ కూడా 500 రూపాయలు వ్వలేదట.
కానీ మొదటిసారి సిల్క్ స్మిత ( Silk Smitha ) 500 రూపాయలు ఇచ్చేసరికి కృష్ణవంశీ చాలా హ్యాపీగా ఫీలయ్యారట.
ఇక సినిమా షూటింగ్ టైం లో చాలామంది సిల్క్ స్మిత డబ్బుని మిస్ యూస్ చేశారట.ఇక ఆ సమయంలో సిల్క్ స్మిత డబ్బుని చాలామంది వాడుకున్నారట.
కానీ ఈ విషయాలన్నీ గమనించిన కృష్ణ వంశీ సిల్క్ స్మిత కి చెబుదామనుకున్నారట.

కానీ సిల్క్ స్మిత తో తనకి అంతగా అనుబంధం లేకపోవడం తో సైలెన్స్ గా ఉన్నారట.సిల్క్ స్మిత ది చాలా దయా గుణం అని,ఎవరు ఏమడిగానా కాదనకుండా ఇచ్చేదని,అందుకే అందరి చేతుల్లో ఈజీ గా మోసపోయిందని ఓ ఇంటర్వ్యూ లో కృష్ణ వంశీ ( Krishna Vamshi ) బాధ పడ్డారు.ఇక తనకిచ్చిన 500 రూపాయల రెమ్యూనరేషన్ అప్పట్లో అదే ఎక్కువని కూడా గుర్తు చేసుకున్నారు.







